- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలనంగా మారిన ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులర్పించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో శనివారం గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీని ఎలా స్మరించుకుంటున్నామో అలాగే తెలంగాణను తెచ్చిన సీఎం కేసీఆర్ను కూడా స్మరించుకోవాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది, ఆయన కూడా మహాత్ముడిలా శాంతి పోరాటమే చేశారని వెల్లడించారు. భారతదేశంలో గాంధీని ఇప్పటికీ ఎలా కీర్తిస్తున్నారో.. కేసీఆర్ను కూడా భవిష్యత్తు తరాలు అలాగే గుర్తు చేసుకుంటారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. తెలిసి అంటున్నారో.. లేక తెలియక మాట్లాడుతున్నారో అంటూ.. దీనిపై సెటైర్లు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ ‘‘ ఓరి మీ దుంపలు తెగ, మీరెక్కడ దొరికారా బాబు.. గాంధీ జయంతి నాడు కూడా వదలట్లేదు. జోకుడుకు కొంచెం గ్యాప్ ఇవ్వండి జర… మంత్రి పదవి గిట్ల ఊడపీకతా అన్నారా ఏంది జోకకుంటే. ఏదిఏమైనా సరే గాంధీ జయంతి సందర్భంగా జోకుట్ల మొదటి బహుమతి నీకే ఎర్రబెల్లి.’’ అని ఉంది.
ఓరి మీ దుంపలు తెగ , మీరెక్కడ దొరికారా బాబు…
గాంధీ జయంతి నాడు కూడా వదలట్లేదు.
జోకుడుకు కొంచెం గ్యాప్ ఇవ్వండి జర…
మంత్రి పదవి గిట్ల ఊడపీకతా అన్నారా ఏంది జోకకుంటే….ఏదిఏమైనా సరే గాంధీ జయంతి సందర్భంగా జోకుట్ల మొదటి బహుమతి నీకే ఎర్రబెల్లి.#VidyardhiNirudhyogaSiren pic.twitter.com/xaZ8sC5kkg
— Share Telangana (@ShareTelangana) October 2, 2021