Erica Fernandes: పడక గది సీన్లు.. ఓపెన్‌గా ఉండటంలో తప్పు లేదు!

by Shyam |   ( Updated:2021-05-28 03:59:41.0  )
Erica Fernandes
X

దిశ, సినిమా :టెలివిజన్ స్టార్ ఎరికా ఫెర్నాండేజ్ ప్రజెంట్ షోస్‌లో బోల్డ్ కంటెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. కావాలనే బోల్డ్ సీన్స్ యాడ్ చేస్తున్నారని అభిప్రాయపడింది. అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతుండటం వల్లే బోల్డ్ ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉంటున్నానని తెలిపింది. ‘కసౌతి జిందగి కే 2’లో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆమె.. బోల్డ్ షోస్ విషయంలో తన ఒపీనియన్‌ను ఓపెన్‌గా చెప్పేస్తానని వివరించింది. తాను చేస్తున్న కంటెంట్‌లో లాజిక్ ఉండాలని, కథలో ఏదైనా జరుగుతుందంటే దానికి సరైన కారణం చూపించాలని అభిప్రాయపడింది.

స్టోరీ రిక్వైర్‌మెంట్‌లో భాగంగా జెన్యూన్‌గా బోల్డ్ సీన్స్ అవసరమైతే తప్పులేదన్న ఎరికా.. కానీ అందుకు కూడా తను ప్రిపేర్ కావాల్సి ఉందని చెప్పింది. అలాంటి కంటెంట్ యూజ్ చేయాల్సిన అవసరమేంటో చెప్తే తప్ప తాను ఒప్పుకోనని స్పష్టం చేసింది. అంతేకాదు ఇండస్ట్రీ తనలో కాన్ఫిడెన్స్ పెంచిందని, లైఫ్‌పై క్లారిటీ తెచ్చుకునేందుకు హెల్ప్ చేసిందన్న నటి.. యాక్టింగ్ కెరియర్ తన ఆలోచనా విధానాన్ని మార్చేసిందని చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed