- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షర్మిల పార్టీలోకి ఏపూరి సోమన్న… ముహూర్తం ఫిక్స్
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న షర్మిల పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నెల 15న షర్మిల సమక్షంలో ఆమె పెట్టబోయే పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆమెతో తొలి దశ సంప్రదింపులు పూర్తయ్యాయి. లాంఛనంగా సోమవారం చేరనున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పరిస్థితితని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తును నిర్ణయించుకోవడంలో భాగంగా షర్మిల పార్టీలో చేరాలనుకుంటున్నారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నల్లగొండ జిల్లాకు చేసిన కృషిని, సాగునీటి రంగంలో చేపట్టిన కార్యక్రమాలు సంతృప్తినివ్వడంతో ఇప్పుడు ఆయన ఇలాంటి నిర్ణయానికి వచ్చారు. మూడు రోజుల క్రితమే షర్మిలతో మాట్లాడిన ఏపూరి సుమారు 500 మంది కార్యకర్తలు, కళాకారులు, అభిమానులతో లోటస్ పాండ్‌లో షర్మిల సమక్షంలో లాంఛనంగా పార్టీలో చేరనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు పదహారు సంవత్సరాలపాటు తన వంతు కృషి చేశానని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీతో విభేదించి కాంగ్రెస్‌కు మద్దతు తెలిపానని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొత్తం రాష్ట్ర ప్రజలకే అర్థమైందని, ఇకపైన ఒక ప్రజా కళాకారుడిగా తాను భవిష్యత్తును ఖరారు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతవరకు ఉన్న పరిస్థితిని ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతి పరిస్థితితో పోల్చుకోలేమని అన్నారు. మూడు రోజుల క్రితమే షర్మిలతో తనంతట తానుగానే వెళ్ళి మాట్లాడానని, గతంలో వైఎస్సార్ చేసిన కృషి కంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె ఎక్కువ చేయగలుగుతుందన్న ఉద్దేశంతో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వైఎస్సార్ తనయగా ఆయనకంటే ఎక్కువ పని చేస్తారన్న ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.