- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానికులకే టీటీడీ దర్శనం టికెట్లు..
దిశ, ఏపీబ్యూరో : డిసెంబరు 25 నుంచి జనవరి 3 వరకు సంబంధించి తిరుమల సర్వదర్శనం టికెట్లు ఈనెల 24 నుంచి స్థానికులకు మాత్రమే జారీ చేస్తామని టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల భక్తులు ఈ విషయం గమనించాలని ఆయన కోరారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10రోజుల పాటు సర్వ దర్శనం టికెట్లు జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కౌంటర్లను మంగళవారం ఆయన పరిశీలించారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ..24 నుంచి ఈ కేంద్రాల్లో రోజుకు 10 వేల చొప్పున 10 రోజులకు లక్ష సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తామన్నారు. రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు 2 లక్షల టికెట్లు ఇప్పటికే ఆన్లైన్‌లో జారీ చేసినట్లు ఈవో తెలిపారు. టికెట్ ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి, శ్రీ వారి మెట్టు నడకదారులు, అలిపిరి రోడ్డు మార్గంలో అనుమతిస్తామన్నారు. భక్తులు టికెట్ లేకుండా వచ్చి ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు.