పర్యావరణవేత్త ఆర్.కె పచౌరీ ఇకలేరు

by Shamantha N |
పర్యావరణవేత్త ఆర్.కె పచౌరీ ఇకలేరు
X

ప్రముఖ పర్యావరణవేత్త, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి) వ్యవస్థాపకులు, మాజీ అధినేత రాజేంధర్ కె.పచౌరీ (79) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గురువారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఐరాస ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ అధ్యక్షుడిగా, అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గొరేతో కలిసి మానవ నిర్మిత వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ఆయన చేసిన కృషికి గానూ 2007లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అంతేకాకుండా ఆయన పద్మభూషన్ (2001), పద్మవిభూషన్(2008) పురస్కారాలు సైతం దక్కించుకున్నారు. కాగా, పచౌరీ మృతి పట్ల టెరి సహా పర్యావరణ వేత్తలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై లైంగికఆరోపణలు రావడంతో 2015లో టెరి డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed