కర్ణాటకలో రవాణా ఆంక్షలు ఎత్తివేత

by Anukaran |
కర్ణాటకలో రవాణా ఆంక్షలు ఎత్తివేత
X

బెంగళూరు: కరోనా వ్యాప్తి కారణంగా మార్చి నుంచి అమలు చేస్తున్న అన్నిరకాల రవాణా ఆంక్షలను ఎత్తివేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపైన ఈ-పాస్, 14 రోజుల క్వారంటైన్ వంటి నిబంధనలు ఏమి అమలులో ఉండవు. కర్ణాటకకు వచ్చే వారికి వేసే హ్యాండ్ స్టాంపింగ్‌ను కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య సులువుగా ప్రయాణికులు రాకపోకలు సాగించేలా, వస్తు రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రం రవాణాపరమైన అన్ని ఆంక్షలను ఎత్తివేసింది.

కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ప్రవేశించడానికి సేవా సింధు పోర్టల్‌లో నమోదు గాని, ప్రభుత్వ అనుమతి గాని అవసరం ఉండదు. అలాగే విమానాశ్రయాలు, రైల్వే, బస్ స్టేషన్లు, రాష్ట్ర సరిహద్దుల్లో కొవిడ్-19 టెస్టుల నిర్వహణను కూడా నిషేధించింది. ఎలాంటి షరతులు లేకుండా రోడ్డు, రైలు, వాయు మార్గం గుండా కర్ణాటక రాష్ట్రంలోకి రాకపోకలను సాగించవచ్చు. ఎలాంటి కొవిడ్-19 లక్షణాలు లేనివారు 14 రోజులు క్వారంటైన్‌‌లో ఉండకుండానే పని ప్రదేశాల్లో రిపోర్ట్ చేయవచ్చు. కానీ, 14 రోజుల్లో ఏదైనా లక్షణాలు బయటపడితే సెల్ఫ్ ఐసోలేట్ అయి, వైద్య సహాయం పొందాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed