- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చరిత్ర సృష్టించిన డెబ్బి హెవిట్
దిశ, స్పోర్ట్స్: బ్రిటన్ మహిళా వ్యాపారవేత్త డెబ్బి హెవిట్ చరిత్ర సృష్టించింది. 158 చరిత్ర కలిగిన ఇంగ్లీష్ ఫుట్‌బాల్ అసోసియేషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. బ్రిటన్ వ్యాపార వర్గాల్లో అందరికీ సుపరిచితం అయిన డెబ్బి 2022 జనవరిలో ఈ పదవిని చేపట్టనున్నారు. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ గ్రెగ్ క్లార్క్ లింగ వివక్ష, జాత్యాంహంకార వ్యాఖ్యలు చేయడంతో అతడి చేత రాజీనామా చేయించారు. ఆ తర్వాత సభ్యులంతా డెబ్బి హెవిట్‌ను చైర్ పర్సన్‌గా ఎన్నుకున్నారు. ‘నన్ను ఈ పదవికి ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది.
పుట్‌బాల్ ద్వారా సమాజానికి కూడా పాజిటివ్ సందేశాలను పంపుతున్న ఈ అసోసియేషన్‌ను మరింత పారదర్శకంగా నడిపిస్తాను’ అని హెవిట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫుట్‌బాల్ అసోసియేషన్ జులై 22 జరిగే సమావేశంలో హెవిట్‌కు సంబంధించిన నియామకాన్ని ఆమోదించనున్నది. డెబ్బి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లాండ్, ఐర్లాండ్ సంయుక్తంగా 2030 ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్డింగ్ దాఖలు చేయనున్నాయి.