ఇంగ్లాండ్ 'రొటేషన్' పద్దతి మంచి నిర్ణయం : డేల్ స్టెయిన్

by Shyam |
Dale Styne
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అమలులోకి తెచ్చిన రొటేషన్ పద్దతిపై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రొటేషన్ పద్దతి కారణంగా ఇండియాతో తొలి రెండు టెస్టులు ఆడిన జాస్ బట్లర్, మొయిన్ అలీ ఇంగ్లాండ్ తిరిగి వెళ్లారు. వారి స్థానంలో జానీ బెయిర్‌స్టో, మార్క్‌వుడ్ ఇంగ్లాండ్ జట్టుతో చేరారు. క్రికెటర్లు సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడకుండా సిరీస్ మధ్యలో విశ్రాంతి ఇవ్వడం వల్ల మరింతగా రాణించగలుగుతారనే ఉద్దేశంతో ఈసీబీ ఈ పద్దతిని అమలులోకి తెచ్చింది. ఇంగ్లాండ్ మాజీలు ఈ పద్దతిపై విమర్శలు గుప్పించినా.. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ మాత్రం సానుకూలంగా స్పందించాడు.

‘ఇంగ్లాండ్ అమలు చేస్తున్న రొటేషన్ విధానం వల్ల అద్భుతమైన క్రికెటర్లను తయారు చేయవచ్చు. ఇప్పటికిప్పుడు దీని ఫలితాలు రాకపోయినా నెమ్మదిగా ఇది జట్టుకు మంచే చేస్తుంది. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న క్రికెటర్లు ఎక్కువగా తయారవుతారు. అప్పుడు జట్టు ఎంపిక సులభతరం అవుతుంది’ అని డేల్ స్టెయిన్ అన్నాడు. పేస్ బౌలర్లు, వికెట్ కీపర్లు సుదీర్ఘంగా సిరీస్‌లు ఆడటం వల్ల గాయాల బారిన పడకుండా ఉంటారని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed