కరోనా లాక్‌డౌన్ అనంతరం తొలి వన్డే సిరీస్

by Shiva |
కరోనా లాక్‌డౌన్ అనంతరం తొలి వన్డే సిరీస్
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ స్తంభించిపోయిన అనంతరం ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ చొరవ తీసుకొని ఆటను ప్రారంభించింది. వెస్టిండీస్‌తో రైజ్ ద బ్యాట్ సిరీస్‌తో టెస్టు క్రికెట్ ప్రారంభించగా.. గురువారం (జులై 30) నుంచి వన్డే క్రికెట్‌కు కూడా తెరలేవనుంది. బయో సెక్యూర్ వేదికలో ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి.

2023లో ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న వరల్డ్ కప్‌కు అర్హతగా ఐసీసీ ప్రారంభించిన ‘సూపర్ లీగ్’ కూడా ఈ ద్వైపాక్షిక సిరీస్‌తోనే మొదలుకానుంది. 2019 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లాండ్‌లో జరగుతున్న తొలి వన్డే సిరీస్ కూడా ఇదే కావడం గమనార్హం. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో మూడు వన్డేలు నిర్వహించనున్నారు. ఐర్లాండ్ జట్టు తమ రెగ్యులర్ టీంతో ఆడనుండగా.. ఇంగ్లాండ్ జట్టులో మాత్రం పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. ఇంగ్లాండ్ తరపున జేసన్ రాయ్, జానీ బారిస్ట్రో, ఇయాన్ మోర్గాన్, మొయిన్ అలీ, రషీద్ అలీ కీలకంగా మారనున్నారు. తొలి వన్డే జులై 30, రెండో వన్డే అగస్టు 1న, మూడో వన్డే అగస్టు 4న జరుగనుంది. మ్యాచ్ ప్రతీ రోజు సాయంత్రం 6.30 గంటలకు (భారతీయ కాలమానం) ప్రారంభ కానుంది. మ్యాచ్‌లు సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి

ఇంగ్లాండ్ టీం :

ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ (వైస్ కెప్టెన్), జానీ బారిస్ట్రో (వికెట్ కీపర్ ), టామ్ బాంటన్, శామ్ బిల్లింగ్స్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, జో డెన్లీ, సకీబ్ మహ్మద్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, రీసీ టాప్లే, జేమ్స్ విన్సీ, డేవిడ్ విల్లే

రిజర్వ్ ఆటగాళ్లు : రిచర్డ్ గ్లీసన్, లూయీస్ గ్రెగొరీ, లియామ్ లివింగ్‌స్టన్

ఐర్లాండ్ టీం :

ఆండ్రూ బాల్బిరైన్ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్ (వైస్ కెప్టెన్), లోర్కాన్ టక్కర్ (కీపర్), కర్టీస్ కాంపర్, గెరెత్ గెలానీ, జాషువా లిటిల్, ఆండీ మెక్ బ్రైన్, బారీ మెక్ కాథీ, కెవిన్ ఓబ్రియన్, విలియమ్ పోర్ట్ ఫీల్డ్, బాయ్డ్ రాన్‌కిన్, హారీ టెక్టర్, క్రెగ్ యంగ్

Advertisement

Next Story