- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం
కొలంబో: గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌట్ కాగా, కెప్టెన్ జోరూట్ డబుల్ సెంచరీ బాదడంతో ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 421 పరుగులు చేసింది. శ్రీలకంపై 286 పరుగుల ఆధిక్యం సాధించింది. శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో 359 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలకం నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించింది. జానీ బెయిర్ స్ట్రో(36), డేనియల్ లారెన్స్ (21) పరుగులతో అజేయంగా నిలిచారు. లక్ష్యం స్వల్పమే అయినా మూడు పరుగులకే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత త్వరత్వరగా జాక్ క్రాలే(8), కెప్టెన్ జోరూట్ (1) వికెట్లు కోల్పోయింది. కేవలం 14 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులకి వచ్చిన జానీ బెయిర్ స్టో (65 బంతుల్లో 35), తన అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న డేనియల్ లారెన్స్ (52 బంతుల్లో 21) మరో వికెట్ పడకుండా జట్టును విజయం వైపు నడిపించారు. వీరిద్దరు కలసి నాలుగో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం అందించడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(228 పరుగులు) చేసిన జోరూట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యారు.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ -135
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ – 421
శ్రీలకం రెండో ఇన్నింగ్స్ – 359
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ – 76/3