‘ఆ ఆటగాళ్లకు క్వారంటైన్ లేదు'

by Shyam |
‘ఆ ఆటగాళ్లకు క్వారంటైన్ లేదు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ (IPL) ప్రారంభానికి రెండు రోజుల ముందు యూఏఈ (UAE) చేరుకునే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు క్వారంటైన్ ఉంటుందా లేదా అనే విషయాన్ని బీసీసీఐ (BCCI) ఇంత వరకు ప్రకటించలేదు. అయితే, వాళ్లకు క్వారంటైన్ నిబంధన వర్తించదని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు సీఈవో వెంకీ మైసూర్ స్పష్టం చేశారు.

వాస్తవానికి యూఏఈ (UAE) వచ్చిన తర్వాత ఆరు రోజుల క్వారంటైన్ తప్పనిసరి. అయితే ఇంగ్లాండ్‌లో బయోబబుల్ (Bio Bubble) వాతావరణం నుంచి యూఏఈ (UAE) బయోబబుల్ వాతావరణంలోకి వస్తుండటం వల్ల వారికి క్వారంటైన్ అవసరం ఉండదని, కేవలం కరోనా టెస్టులు మాత్రం చేసి నెగెటివ్ వస్తే ఐపీఎల్‌లోకి అనుమతిస్తారని వెంకీ మైసూర్ అంటున్నారు.

దుబాయ్, షార్జాలో ఆరు రోజుల క్వారంటైన్ నిబంధన ఉన్నా, అబుదాబిలో మాత్రం 14 రోజుల కచ్చితమైన క్వారంటైన్ నిబంధన అమలు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్, (MI) కేకేఆర్ (KKR) జట్లు మాత్రమే ప్రస్తుతం అబుదాబిలో ఉన్నాయి. ముంబై జట్టులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు లేరు. కానీ కేకేఆర్ జట్టులో ఈయాన్ మోర్గాన్, టామ్ బాంటన్, పాట్ కమిన్స్ చేరాల్సి ఉంది. ఈ విషయంపై ప్రస్తుతం అబుధాబి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే ఐపీఎల్ (IPL) తొలి మ్యాచ్ నుంచే ఈ రెండు దేశాల ఆటగాళ్లు అందుబాటులోకి వస్తారు.

Advertisement

Next Story