అక్రమ కట్టడాలపై జీహెచ్​ఎంసీ కొరడా..

by  |
అక్రమ కట్టడాలపై జీహెచ్​ఎంసీ కొరడా..
X

దిశ, న్యూస్​బ్యూరో: నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల‌పై జీహెచ్​ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. శేరిలింగంప‌ల్లి జోన్‌లో జూన్​ 27 నుంచి స్పెష‌ల్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పిటివరకు 30 భ‌వ‌నాల‌ను కూల్చివేశారు. అంత‌కుముందు అదే నెల‌లో అయ్యప్ప సొసైటీలో భారీ యంత్రాల‌ను ఉపయోగించి పలు బహుళ అంత‌స్తులు, ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టిన నిర్మాణాల‌ను కూడా కూల్చివేశారు. ఈ విషయాన్ని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​ అధికారికంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన‌ధికారికంగా, అనుమ‌తులు లేకుండా నిర్మించిన ప్లాట్లను కొనుగోలు చేయ‌రాద‌ని ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ ద్వారా జారీ అయిన ఆక్యుపెన్సి స‌ర్టిఫికెట్ క‌లిగిన ప్లాట్లను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. అందుకోసం జీహెచ్​ఎంసీ వెబ్‌సైట్‌లో నిర్మాణ అనుమ‌తుల‌తో పాటు ఆక్యుఫెన్సీ స‌ర్టిఫికేట్ల జారీకి సంబంధించిన వివ‌రాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఏమైనా సందేహాలుంటే స‌మీపంలోని స‌ర్కిల్ కార్యాల‌యాల‌ను సంప్రదించి సంబంధిత భ‌వ‌నాలు, ప్లాట్ల నిర్మాణ అనుమ‌తులు, ఆక్యుఫెన్సి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చని కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు.


Next Story