ములుగు జిల్లాలో ఎన్‎కౌంటర్

by Shyam |
ములుగు జిల్లాలో ఎన్‎కౌంటర్
X

దిశ ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో జరిగిన ఎన్‎కౌంటర్‎లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఆదివారం మంగపేట మండలం నర్సింహసాగర్ ఆడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. మృతదేహాలను ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

మృతులు మణుగూరు ఏరియా కమిటీ కమాండర్ సుధీర్, మరో మావోయిస్ట్ లాక్మాల్‎గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ‌ ఎన్‌కౌంటర్‎తో ములుగు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీల్లో కూంబింగ్ కొనసాగడంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోని వంతెనల వద్ద పోలీసుల వాహన తనిఖీలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed