ఆ బిల్లు పార్లమెంట్‌లో‌కి వచ్చిన రోజు దేశమంతా అంధకారం..

by Sridhar Babu |   ( Updated:2021-07-19 03:34:35.0  )
ఆ బిల్లు పార్లమెంట్‌లో‌కి వచ్చిన రోజు దేశమంతా అంధకారం..
X

దిశ, భూపాలపల్లి: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ టీఎస్,జేఏసీ ఆధ్వర్యంలో కేటీపీపీ ప్రధాన ద్వారం ముందు అన్నీ అసోసియేషన్లు, ట్రేడ్ యూనియన్ల సిబ్బందితో నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం ఉదయం సుమారు మూడు గంటల పాటు విద్యుత్ సంస్థ ఉద్యోగులు కాకతీయ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్‌లో ఈరోజు ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లు వలన సామాన్య ప్రజలకు రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోందని, దీనివల్ల పారిశ్రామికవేత్తలు లాభపడే అవకాశాలు ఉన్నాయని వారు ఆరోపించారు.

బిల్లు సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఉందని అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అవసరమైతే విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంటులో కి వచ్చిన రోజు దేశాన్ని అంధకారం చేస్తామని తెలిపారు. ఈ బిల్లు వలన సామాన్యుడు, ధనవంతుడు ఒకే విధమైన బిల్లు చెల్లించే విధంగా ఉంటుందని, ఈ బిల్లు విషయంపై ప్రజల్లో చైతన్యం కలిగించి పార్లమెంటులో బిల్లు అమలు కాకుండా చూస్తామని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఇది సరైన చర్య కాదన్నారు.

Advertisement

Next Story