- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంట నిన్న సందడి.. నేడు తీవ్ర విషాదం..
దిశ, తుంగతుర్తి: విధి ఎంత విచిత్రమైనదంటే ఎప్పుడు ఎవరికి ఏమి తల పెడుతుందో తెలియని పరిస్థితి. అంతే కాదు దాని పరిధి కింద అందరూ సమానులే అయినప్పటికీ విధి శాసించే విధానాలు విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇంట్లో జరిగింది. గురువారం హైదరాబాద్ లోని తన ఇంట్లో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే మరునాడే తండ్రి మరణ వార్త వినాల్సి వచ్చింది. ఈ సంఘటన పలువురిని కలచివేసింది. వారం రోజుల క్రితం నుంచే గాదరి కిషోర్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ముందస్తుగానే కోలాహలం చేశారు. ఈ మేరకు ఉప్పల్ కళ్యాణపురి కాలనీలో నివాసముంటున్న కిషోర్ కుమార్ ఇంటికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానాలు చేయడానికి బుధవారం అర్ధరాత్రి నుండే అభిమానులంతా క్యూ కట్టారు.
శుక్రవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు కూడా ఆయన ఇంటికి అభిమానుల తాకిడి వరదలా సాగింది. అయితే సంబరాల సరదాని మర్చిపోకముందే గాదరి కిషోర్ కుమార్ తండ్రి గాదరి మారయ్య(73) శుక్రవారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఈ పరిణామంతో కిషోర్ కుమార్ నీరసత్వంతో నలిగిపోయారు. ఆస్పత్రిలో ఉన్న తండ్రి తన జన్మదిన వేడుకలను విని సంతోషించిన సంఘటనను మరచిపోకముందే మృతి చెందిన చేదు వార్త విషాదాన్ని నింపింది. కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలకు సంతోషంగా వచ్చిన అభిమానులు నేడు విషణ్ణ వదనంతో నల్లగొండలోని ఆయన ఇంటికి చేరి నివాళులు అర్పిస్తున్నారు.
సమావేశం పూర్తయ్యాక….
శుక్రవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కిషోర్ కుమార్ హాజరయ్యారు. సమావేశం పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కు తండ్రి మారయ్య మరణ వార్త తెలిసింది. వెంటనే ఆయన పనులన్నీ పక్కన పెట్టి ఆస్పత్రిలో ఉన్న తండ్రి వద్దకు చేరి బోరున విలపించారు.
తండ్రి ప్రోద్భలంతోనే…!
గాదరి మారయ్య, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కిషోర్ కుమార్ రెండవ సంతానం. కాగా మారయ్య, సుజాత దంపతులిద్దరు వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ పొందారు. అయితే మొదటి నుంచి కిషోర్ కుమార్ అంటే తండ్రి మారయ్యకు అమితమైన ప్రేమ. ఎమ్మెల్యే కిషోర్ ఎదుగుదలకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు.