- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాలెన్స్ పైసలిస్తేనే డెడ్‌బాడీ ఇస్తాం..
దిశ, మానకొండూరు: పొట్ట కూటి కోసం మలేషియాకు వెళ్లి చనిపోయిన వలస కూలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. అనారోగ్యంతో తుదిశ్వాస వదిలిన తన భర్త డెడ్ బాడీని ఇప్పించాలని వేడుకుంటోంది అతని భార్య.
వివరాల్లోకివెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కోరేపు ఎల్లయ్య (48) రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లి అక్కడ ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిలో చేరాడు. మూడు నెలల కిందట అతను అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచాడు. అనంతరం అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి ఎల్లయ్య మృతదేహాన్ని తరలించారు.
ఇదిలాఉంటే, అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలంటే రూ.లక్షా 30వేలు ఇంకా చెల్లించాల్సి ఉంది. బ్యాలెన్స్ డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయని అతని భార్య జ్యోతి వాపోయింది. ఎల్లయ్య ఆరోగ్యం బాగా లేదని తెలినప్పటి నుంచి ఇప్పటివరకు అప్పుచేసి రూ. 2 లక్షలు పంపించామని, ఇంకా డబ్బు చెల్లించే స్థోమత తనకు లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపి తన భర్త శవాన్నిఇండియాకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది.