30 మంది అభ్యర్థుల ఎలిమినేషన్..

by Shyam |
30 మంది అభ్యర్థుల ఎలిమినేషన్..
X

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్ : హైద‌రాబాద్ , రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకుండా పోయిన నేప‌థ్యంలో రెండ‌వ ప్రాధాన్య‌తా ఓట్ల‌పై అంత‌టా ఆస‌క్తి మొద‌లైంది. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో సెకండ్​ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోండ‌గా అభ్యర్థుల ఎలిమినేషన్​తో పాటు వారికి వచ్చిన సెకండ్​ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కేటాయిస్తున్నారు.

ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఇప్పటి వరకూ 30 మంది అభ్యర్థుల ఎలిమినేషన్​ పూర్తయింది. ఎలిమినేషన్ అయిన అభ్యర్థుల ఓట్లలో సెకండ్​ ప్రాధాన్యత ఓట్ల కేటాయింపులోనూ టీఆర్​ఎస్​కే మొగ్గు కనబ‌డుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో టీఆర్​ఎస్​కు 113, బీజేపీకి 97, కాంగ్రెస్​కు 48, ప్రొఫెసర్​ నాగేశ్వర్​కు 67 ఓట్లు వచ్చాయి. అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు (రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి) ఇలా ఉన్నాయి. బీజేపీ–1,04,765 , టీఆర్ఎస్​–1,12,802, నాగేశ్వర్​ –53,677, కాంగ్రెస్​– 31,602 లభించాయి.

Advertisement

Next Story