ఆపరేషన్.. ఎలిమినేషన్

by Shyam |
Counting2
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు నమోదైన అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు శ్రీకారం చుట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల అనంతరం ఏకంగా 16 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఎలిమినేట్ అయిన 16 మంది అభ్యర్థులకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు బదలాయింపు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed