హెయిర్ స్టైల్ మీకే కాదు.. మాకూ ఉందోయ్

by Shamantha N |
హెయిర్ స్టైల్ మీకే కాదు.. మాకూ ఉందోయ్
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా హెయిర్ స్టైల్స్‌ మనుషులు చేసుకుంటారు. కానీ తమిళనాడులో వెరైటీగా ఓ ఏనుగుకు ప్ర‌త్యేక‌మైన హెయిర్‌స్టైల్ క‌లిగి ఉంది. దీనిని చూసిన అందరూ మునిగిపోవాల్సిందే. అంతేకాకుండా ఆ ఏనుగుకు ఇంట‌ర్‌నెట్‌లోనూ అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఇది మ‌న్నార్గుడి ప‌ట్ట‌ణంలోని రాజ‌గోపాల‌స్వామి ఆల‌యంలో నివ‌సిస్తున్న‌ది. త‌న హెయిర్‌స్టైల్‌తో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న‌ది. ‘‘బాబ్-కట్ సెంగమలం’’ అని పిలిచే ఈ ఏనుగు ఫోటోల‌ను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుధా రామెన్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు.

సెంగమలంను 2003లో కేరళ నుంచి రాజగోపాలస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. దీని హెయిర్‌స్టైల్ బాధ్య‌త‌లు మహౌట్ ఎస్ రాజగోపాల్ తీసుకుంటారు. ఈ హెయిర్‌క‌ట్‌ను ఒక‌సారి ఇంట‌ర్‌నెట్‌లో రాజ‌గోపాల్‌ చూశార‌ట. సెంగ‌మ‌లంకు కూడా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని అప్ప‌టి నుంచి ఏనుగుకు జుట్టు పెంచ‌డం మొద‌లుపెట్టానంటున్నారు మ‌హౌట్‌. ఈ ఫోటోలు 10 వేల లైక్స్ సంపాదించుకున్న‌ది.

వేస‌వి కాలంలో అయితే సెంగ‌మ‌లం జుట్టును రోజుకు మూడుసార్లు శుభ్ర‌ప‌రిచేవార‌ట‌. ఇత‌ర సీజ‌న్ల‌లో అయితే క‌నీసం రోజుకు ఒక‌సారి క‌డుగుతారు. అంతేకాదు వేస‌విలో ఏనుగును చ‌ల్ల‌గా ఉంచ‌డానికి మ‌హౌట్ రూ. 45,000 విలువైన ప్ర‌త్యేక ష‌వ‌ర్‌ను కూడా ఏర్పాడు చేశార‌ట‌. శ‌రీరంలోని వేడిని తొలిగించ‌డానికి త‌ల‌మీద ఉన్న జుట్టు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఏదైతేనేం ఈ ఏనుగు మాత్రం ల‌గ్జ‌రీగా బ‌తికేస్తున్న‌ది.

Advertisement

Next Story