- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్‌లో ఓటింగ్ పెరిగేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ‘నో యువర్ పోలింగ్ బూత్’ సర్వీసును అందిస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే నోటిఫికేషన్‌కు, ఎన్నికలకు మధ్య తక్కువ సమయం ఉండటంతో టెక్నాలజీ ఆధారంగా అన్ని పద్దతుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేకపోయినట్టు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
వరుసగా జరిగిన మూడు గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ 50 శాతానికి మించలేదు. 2002-16 మధ్యలో ఓటింగ్ శాతాన్ని చూసి నివ్వెరపోయిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించారు. 2018లో అసెంబ్లీ, 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం (స్వీప్) ఇన్‌చార్జిగా ఐఏఎస్ హరిచందన ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
మొబైల్ మిస్ కాల్ సర్వీస్, టోల్ ఫ్రీ నెంబర్, మొబైల్ యాప్, వెబ్‌సైట్‌తో పాటు నగరంలో బ్యానర్లు, ఫ్లెక్సీల ద్వారా ఓటర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రభావం ఓటింగ్ శాతంలో కనిపించింది. 2002లో నిర్వహించిన బల్దియా ఎన్నికల్లో ఓటింగ్ 42 శాతం 2009లో 43 శాతం నమోదైంది. ఇది గ్రహించిన అధికారులు సాధ్యమైనంత ఎక్కువగా పబ్లిసిటీ చేశారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఓటింగ్ రికార్డు స్థాయిలో 48.89 శాతం నమోదైంది. అధికారులు మొబైల్స్, టెక్నాలజీ సహాయంతో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పనిచేశారు. మొత్తంగా 2016 నుంచి 2019 వరకూ జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం పెరిగినట్టు గణంకాలు చెబుతున్నాయి.
పలు వార్డుల్లో అతి తక్కువ ఓటింగ్
సామాజిక సంఘాలు, క్లబ్స్, వాకర్ అసోసియేషన్లు, అపార్ట్ మెంట్ సొసైటీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమై పలు సూచనలు సైతం చేసింది. తక్కువ ఓటింగ్ శాతం నమోదైన ప్రాంతాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి సాధించాలని కమిషనర్ కోరారు. నగరంలో విద్యాధికులు, సంపన్న వర్గాలు అధికంగా ఉండే సెంట్రల్ వెస్ట్‌జోన్‌లలోని పలు వార్డుల్లో గతంలో అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రిటీల సహకారాలు పొందాలని అధికారులు భావిస్తున్నారు. కాని కార్యచరణలో అది సాధ్యపడటం లేదు. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ కేవలం రోజుల వ్యవధిలోనూ పూర్తవుతోంది. ఈ సారి ఓటింగ్‌కు సంబంధించిన హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినప్పటికీ వార్డుల్లో, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు అంతగా కనిపించడం లేదు. మై జీహెచ్ఎంసీ యాప్‌లో ఓటర్ లొకేషన్, బూత్‌ను కనుక్కొనేందుకు సాఫ్ట్ వేర్ రూపొందించారు. గతం మాదిరిగా కార్యక్రమాలు చేపట్టేందుకు సిబ్బంది కొరత ఉందని ఓ అధికారి తెలిపారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ వివరాలు:
ఏడాది ఓటింగ్ శాతం
2002 – 41.22 %
2009 – 42.95 %
2016 – 45.27 %