ఎవరైనా ఇలా చేస్తే వారికి ఏడేళ్ల జైలు శిక్ష తప్పదు: అనిత

by Sridhar Babu |   ( Updated:2021-11-20 03:59:37.0  )
balaala-parirakshna-committ
X

దిశ, కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని లకుడారంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారిని అనిత ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో గ్రామ సర్పంచ్ కందూరి కనకవ్వ- అయిలయ్యను చైర్మన్ గా, అంగన్వాడీ టీచర్లు జి.భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మిని కన్వీనర్లుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారిని అనిత మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయిలకు, 21 సంవత్సరాలు దాటిన తర్వాత అబ్బాయిలకు వివాహం జరిపించాలని.. ఈ లోపు వివాహం జరిపించినట్లయితే బాల్య వివాహాలు నిషేధ చట్టం 2006 ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష , జరిమానా విధించబడతాయి అని హెచ్చరించారు.

బాలలపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో చట్టం 2012 ప్రకారం కనీసం ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతదని, పిల్లలు లేని దంపతులు చట్టపరంగాని దత్తత తీసుకోవాలని సూచించారు. బాల బాలికలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098, 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ బాలల పరిరక్షణకై ప్రతి ఒక్కరం బాధ్యతగా ఉంటామని.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్, ఆశా వర్కర్ డి. శ్యామల, బీసీ జిల్లా అధ్యక్షులు ఐలయ్య, కిశోర, బాలికలు, గ్రామంలోని పెద్దలు, పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed