- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాంబ్ పేల్చిన ఈసీ.. కేసీఆర్ సభకు ఊహించని చిక్కులు
దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలు, అక్కడి కోడ్ అమలుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఏ విధంగా వర్తిస్తుంది, అధికారులు ఎలా అమలుచేయాలనే అంశమై స్పష్టమైన మార్గదర్శకాలే ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తున్నాయని, ఎన్నికల అధికారులు కూడా తు.చ. తప్పకుండా అమలుచేయడంలో విఫలమవుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
పరోక్షంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో జరుగుతున్న పార్టీల ప్రచారాన్ని కూడా ఆయన ప్రస్తావించి ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం సమీప ప్రాంతాల్లో భారీ స్థాయి బహిరంగ సభ పెట్టాలన్న సీఎం ఆలోచనకు కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులతో చిక్కులు ఏర్పడినట్లయింది. తాజా లేఖ ప్రకారం కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ వర్తించనున్నట్లు స్పష్టమవుతున్నది.
ఉప ఎన్నిక జరుగుతున్నట్లయితే ఆ నియోజకవర్గం ఒక మున్సిపల్ కార్పొరేషన్‌లో లేదా మెట్రోపాలిటన్ నగరంలో లేదా రాష్ట్ర రాజధానిలో ఉన్నట్లయితే ఎలక్షన్ కోడ్ కేవలం ఆ నియోజకవర్గ పరిధిలోకి మాత్రమే ఉంటుందని, కానీ ఈ మూడు విభాగాలకు చెందని నియోజకవర్గం అయినట్లయితే మొత్తం జిల్లాకు వర్తిస్తుందని అనూజ్ చందక్ క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గానికి కొంత దూరంలో ఉండే ప్రాంతంలో భారీ స్థాయి బహిరంగసభలు పెట్టడం కోడ్‌లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధమేనని స్పష్టం చేశారు. అలాంటి సభలు జరగడానికి వీల్లేదని చెప్తూనే వాటి ఖర్చును ఆయా పార్టీల ఎన్నికల వ్యయంకింద లెక్కించాలని, కొవిడ్ నిబంధనలను అమలుచేయాలని నొక్కిచెప్పారు.
Enforcement of Model Code of Conduct (MCC) during bye-election in the entire district – regarding.