- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగాల్ సీఎంకు ఈసీ షాక్..
X
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) షాక్ ఇచ్చింది. మతం పేరిట ప్రచారం నిర్వహించిన వివాదంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల హుగ్లీలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో దీదీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి. ముస్లింల ఓట్లు చీలకుండా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఇది ఎన్ని్కల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. దీనిపై స్పందించిన ఈసీ.. బుధవారం మమతకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వని పక్షంలో చర్యలు ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. అయితే ఈ నోటీసులపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. బీజేపీపై తాము ఇచ్చిన ఫిర్యాదులకు సమాధానమేదని.. ఈసీ పక్షపాత ధోరణికి ఇదే నిదర్శనమని ఆరోపించారు.
Advertisement
Next Story