సర్కార్ కీలక ప్రకటన.. మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టిన ప్రజలు

by Shyam |
సర్కార్ కీలక ప్రకటన.. మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టిన ప్రజలు
X

దిశ, చేవెళ్ల : తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ వయసు 65 నుంచి 57 తగ్గించడంతో వృద్ధులు మీ సేవా కేంద్రాలలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు బారులు తీరారు. వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులు చేసేందుకు ఈనెల 30 వరకు ఆఖరు తేదీ గడువు విధించడంతో వృద్ధులు తమ తమ గ్రామాల నుంచి మండల కేంద్రాలలోని మీ సేవ కేంద్రాల వద్ద పేరు నమోదు చేసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచి బారులు తీరి కనిపిస్తున్నారు.

చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ తదితర మండలాల పరిధిలోని మీ సేవ కేంద్రాల వద్ద వృద్ధులు క్యూ కట్టారు. పింఛన్ దరఖాస్తు కోసం అవసరమయ్యే ధ్రువపత్రాలను, వాటి జిరాక్స్ కాపీలను, ఫోటోలను వెంట తెచ్చుకొని వేచి చూస్తున్నారు. రాష్ట్రమంతా ఒకేసారి పింఛన్ల కోసం దరఖాస్తు చేస్తుండటంతో కొన్ని మీ సేవా కేంద్రాల వద్ద సర్వర్లు మొరాయించడంతో వారు వేచి చూస్తున్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు తెలుసుకునేందుకు మీ సేవ కేంద్రాల వద్ద పోటీ పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed