విజయవాడ రైల్వే స్టేషన్‌కు హరిత హంగులు

by srinivas |
విజయవాడ రైల్వే స్టేషన్‌కు హరిత హంగులు
X

దిశ, ఏపీ బ్యూరో : సౌత్ సెంట్రల్ రైల్వేలో ముఖ్యమైన విజయవాడ రైల్వే స్టేషన్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. బెజవాడ స్టేషన్‌ను హరితస్టేషన్‌గా మార్చేందుకు గానూ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధికారులు స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌లపై సోలార్ పలకలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 4,5ఫ్లాట్ ఫాంలపై ఈ సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, దానిని రైల్వేఫ్లాట్‌మ్ లైటింగ్ తోపాటు ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ నిర్ణయంతో రైల్వే స్టేషన్ అత్యంత సుందరంగా కనిపించడంతోపాటు విద్యుత్ వినియోగపు బిల్లులను తగ్గించుకోనుంది రైల్వే శాఖ.

Advertisement

Next Story

Most Viewed