- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదవి ప్రజల భిక్షం.. ఈటల సంచలన వ్యాఖ్యలు
X
దిశ ,కమలాపూర్: ఏ పదవులు అయినా ప్రజలు ఓట్లేస్తేనే వచ్చాయని, అది ప్రజల భిక్ష అని ఆదివారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పలపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి జరిగే ఎన్నికలు చిన్న ఎన్నికలు కావని , రేపటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జోస్యం చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇచ్చే దళిత బంధు, గొర్రెల ఫంపిణి ,పింఛన్లు , కొత్త రేషన్ కార్డులు, రోడ్లు , సంక్షేమ పథకాలు ఈటల రాజేందర్ రాజీనామా ద్వారానే వస్తున్నాయని ప్రజలు మర్చిపోవద్దన్నారు. పథకాల రూపంలో ఇచ్చే డబ్బులు ప్రజలు కట్టే పన్నుల నుండే ఇస్తున్నారని , వారి సొంత ఇంట్లో నుండి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని, ప్రమాణాలు వేయిస్తే వేయకండని, ధర్మం తప్ప కూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story