- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS LPCET - 2023 నోటిఫికేషన్ విడుదల
దిశ, ఎడ్యుకేషన్: హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి లేటరల్ ఎంట్రీ ఇన్‌టూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎల్‌పీసెట్) - 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్/ఇన్‌స్టిట్యూషన్స్(ప్రభుత్వ/ఎయిడెడ్/అన్ ఎయిడెడ్/ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు)ల్లో సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు.
ఎంట్రన్స్ టెస్ట్:
లేటరల్ ఎంట్రీ ఇన్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎల్‌పీసెట్) - 2023.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీఈటీ) నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విక్రయానికి చివరి తేదీ: ఏప్రిల్ 20, 2023.
(ఆలస్య రుసుము రూ. 100తో దరఖాస్తు విక్రయానికి చివరి తేదీ: ఏప్రిల్ 21,2023)
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 21, 2023.
ఎంట్రన్స్ టెస్ట్: మే 22, 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.sbtet.telangana.gov.in