- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JEE మెయిన్‌కు మొత్తం దరఖాస్తులు ఇవే?
![JEE మెయిన్‌కు మొత్తం దరఖాస్తులు ఇవే? JEE మెయిన్‌కు మొత్తం దరఖాస్తులు ఇవే?](https://www.dishadaily.com/h-upload/2023/12/09/288394-jee-main-exam.webp)
దిశ, వెబ్‌డెస్క్: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 2 వ తేదీన మొదలైంది. కాగా అభ్యర్థుల నుంచి డిసెంబరు 4 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి నిర్వహించనున్న ఈ జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షకు ఏకంగా 12. 30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య 3.70 లక్షలు అధికంగా ఉండటం విశేషం. అత్యధిక అప్లికేషన్స్‌తో ఈ సారి మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది.
ఇక రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి 1.60 లక్షల మంది, ఏపీ నుంచి 1.30 లక్షలు, తెలంగాణ నుంచి 1.20 లక్షల మంది జేఈఈ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో చేరొచ్చు. బీటెక్ సీట్ల కోసం మెయిన్‌లో పేపర్-1, బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 రాయాల్సి ఉంటుంది. కాగా మొదటి సెషన్ ఈ ఏడాది జనవరిలో రెండో విడత ఎగ్జామ్ ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న ఫలితాలను విడుదల చేస్తారు.