NTRO: నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్.. జీతం ఎంతంటే..?

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-18 14:42:19.0  )
NTRO: నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్.. జీతం ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi)లోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(NTRO) సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 75 సైంటిస్ట్ 'బి' పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ కేటగిరీలో 25, ఓబీసీలకు 18, ఎస్సీ లకు 17, ఎస్టీలకు 9, ఈడబ్ల్యూఎస్‌లకు 6 పోస్టుల చొప్పున కేటయించారు. ఆసక్తి గల అభ్యర్థులు www. ntro.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 08, 2024.

విద్యార్హత:

పోస్టును బట్టి మాస్టర్స్ డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అలాగే గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే జనరల్ అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

గేట్ స్కోర్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ.250 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.

జీతం:

సైంటిస్ట్ 'బి' ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 – రూ.1,77,500 మధ్య జీతం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed