విద్యార్థులకు గుడ్ న్యూస్..ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్

by Disha Web Desk 18 |
విద్యార్థులకు గుడ్ న్యూస్..ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పీయూసీ-బీటెక్‌ (రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్ల బీటెక్) ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం(మే 6) విడుదలైంది. ఈ నెల 8న ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి వర్సిటీ అధికారులు వీలైనంత త్వరగా ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత వీలైనంత వేగంగా ప్రవేశాల ప్రక్రియ చేపట్టి జులై నెలలో తరగతులు ప్రారంభమయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. సర్కార్ బడుల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్‌ స్కోర్‌ను జోడించి మెరిట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక https://www.rgukt.in/ వెబ్‌సైట్‌‌ని సందర్శించండి.

Next Story

Most Viewed