- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NIACL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
దిశ, ఫీచర్స్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ 1 ఫిబ్రవరి 2024 న ప్రారంభం అయి 15 ఫిబ్రవరి 2024 న ముగుస్తుంది. కంపెనీ ఇప్పటికే షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అధికారిక వెబ్‌సైట్ newindia.co.in ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 అసిస్టెంట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరగనుంది.
అర్హత, వయోపరిమితి
జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం, అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొంది ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము రూ. 600 ఉండగా ఎస్సీ, ఎస్టీలు రూ. 100 చెల్లించాల్సి ఉంది. మరిన్ని సంబంధిత వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ
newindia.co.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.
అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడం ప్రారంభించండి.
అన్ని వివరాలను నమోదు చేసి ఆన్లైన్ లో పత్రాలను అప్‌లోడ్ చేయండి.
ఇప్పుడు ఒకసారి చెక్ చేసి సబ్మిట్ చేయండి.
దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే సమర్పించాలి. రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లేదా ఇతర మార్గాల ద్వారా చేసిన దరఖాస్తులు చెల్లవు.