NEET MDS 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. చివరి తేది ఎప్పుడంటే..

by Sumithra |
NEET MDS 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. చివరి తేది ఎప్పుడంటే..
X

దిశ, ఫీచర్స్ : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ 2024 (NEET MDS 2024) కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్‌సైట్, nbe.edu.in లాగిన్ అయ్యి నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 ఫిబ్రవరి 2024.

షెడ్యూల్ ప్రకారం NEET MDS 2024 పరీక్ష మార్చి 18, 2024న నిర్వహించనున్నారు. ముందుగా ఈ పరీక్షను ఫిబ్రవరి 9న నిర్వహించాల్సి ఉంది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ 13 మార్చి 2024 న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18 నాటికి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఎవరు నమోదు చేసుకోవచ్చు ?

పరీక్ష కోసం నమోదు చేసుకునే అభ్యర్థులు స్టేట్ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేయబడిన ఏదైనా సంస్థ నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) డిగ్రీని పొంది ఉండాలి. అలాగే ఆమోదించబడిన/గుర్తింపు పొందిన డెంటల్ కాలేజీలో ఒక సంవత్సరం తప్పనిసరి రొటేషనల్ ఇంటెన్షిప్ చేసి ఉండాలి.

NEET MDS 2024 ఎలా నమోదు చేసుకోవాలి ?

NBEMS nbe.edu.in అధికారిక వెబ్‌సైట్‌ ను లాగిన్ అవ్వండి.

NEET MDS ట్యాబ్‌కి వెళ్లి అప్లికేషన్‌ పై క్లిక్ చేయండి.

రిజిస్ట్రేషన్ లింక్‌ పై క్లిక్ చేసి, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను రూపొందించండి.

తరువాత వివరాలను నమోదు చేసి, పత్రాలను అప్‌లోడ్ చేయండి.

ఫీజు చెల్లించి సమర్పించండి..

neet mds 2024 దరఖాస్తు రుసుము

గత ఏడాదితో పోలిస్తే అన్ని కేటగిరీలకు నీట్‌ ఎండీఎస్‌ పరీక్ష ఫీజును తగ్గించారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.2500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మొత్తం సమాచారం కోసం, అభ్యర్థులు జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed