విద్యార్థులకు అలర్ట్: స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకున్నారా.. ఇవాళే లాస్ట్ డేట్

by GSrikanth |   ( Updated:2022-08-31 05:28:14.0  )
విద్యార్థులకు అలర్ట్: స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకున్నారా.. ఇవాళే లాస్ట్ డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: HDFC బ్యాంకు యాజమాన్యం విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించనుంది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవాలని సూచించింది. ఇందులో స్కూల్ పిల్లలతో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ వరకు అప్లై చేసుకోవాలని కోరింది.

స్కాలర్‌షిప్‌ పొందడానికి అర్హతలు..

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

స్కాలర్‌షిప్‌: 1-6వ తరగతి వరకు రూ.15,000, 7-12వ తరగతి వరకు రూ.18,000 చెల్లిస్తారు.

అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్కాలర్‌షిప్‌

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేన్‌ చదువుతున్న వారు అర్హులు.

10, 12వ తరగతి, డిప్లొమా చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్కాలర్‌షిప్‌: డిప్లొమా వారికి రూ.20,000, అండర్‌ గ్రాడ్యుయేషన్‌-రూ.30,000, ప్రొఫెషనల్‌ కోర్సులు-రూ.50,000 చెల్లిస్తారు.

పీజీ స్కాలర్‌షిప్‌

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు.

స్కాలర్‌షిప్‌: పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35,000.. ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులు-రూ.75,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Also Read : ఐ2యూ2 దేశాల చూపు మన వైపు!భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగబోతుందా?

Advertisement

Next Story

Most Viewed