- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాల్లో GDS 2023 ఎంపిక ఫలితాలు విడుదల
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ (గ్రామీణ డాక్ సేవక్) జులై 2023 ఎంపిక ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 30, 041 జీడీఎస్ ఖాళీల భర్తీకి ఈ ఏడాది జులై 2 వ తేదీన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లకు సంబంధించి ఉద్యోగాల కోసం అప్లికేషన్ చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల అయిదో జాబితాను తపాలా శాఖ ఈ రోజు (డిసెంబరు 9) విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో సెలక్ట్ అయిన అభ్యర్థులు డిసెంబరు 18 లోగా డాకుమెంట్స్ పరిశీలనకు హాజరుకావాలని పోస్టల్ డిపార్ట్‌మెంట్ సూచించింది. సెలక్ట్ అయిన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి ప్రారంభ జీత భత్యం.. రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ఉంటుంది.