గేట్ 2024 పరీక్షలు ప్రారంభం.. పరీక్ష మార్గదర్శకాలు ఇవే..

by Sumithra |
గేట్ 2024 పరీక్షలు ప్రారంభం.. పరీక్ష మార్గదర్శకాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : GATE ఎగ్జామ్ 2024ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. GATE 2024 పరీక్ష 3 ఫిబ్రవరి, 4 ఫిబ్రవరి, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునే ముందు గేట్ అడ్మిట్ కార్డు పై ఇచ్చిన పరీక్ష సూచనలను పాటించాలి. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, గేట్ పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం నిర్వహించే పరీక్ష 9.40 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

డ్రెస్ కోడ్ ఏమిటి ?

పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన ID కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. అభ్యర్థులు వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి. మెటల్ బటన్లు లేదా ఇతర మెటల్ అలంకరణ ఉన్న బట్టలు ధరించడం నిషేధం. అభ్యర్థులు టోపీ ధరించి పరీక్షా కేంద్రానికి వెళ్లకూడదు. ఎలాంటి ఆభరణాలు ధరించేందుకు అనుమతి లేదు. స్మార్ట్‌వాచ్‌లు, మొబైల్ ఫోన్‌లు, బ్లూటూత్ పరికరాలు, హెడ్‌ఫోన్‌లు పరీక్షాకేంద్రానికి తీసుకెళ్లడానికి ఎలాంటి పర్మిషన్ లేదు.

పరీక్ష మార్గదర్శకాలు ఏమిటి ?

పరీక్ష రోజున మీ గేట్ అడ్మిట్ కార్డ్ 2024, చెల్లుబాటు అయ్యే ఫోటో ID కార్డ్‌ని మీ వెంట తీసుకెళ్లడం అవసరం.

మీరు పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందు పరీక్ష హాల్‌ లో రిపోర్ట్ చేయాలి.

పరీక్ష ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత విద్యార్థులను లాగిన్ చేయడానికి అనుమతించరు.

పరీక్ష ప్రారంభానికి 20 నిమిషాల ముందు సూచనలను చదవడానికి మీరు లాగిన్ చేయవచ్చు.

పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్, మాస్క్ తీసుకెళ్లవచ్చు.

పరీక్ష హాల్ లోపల ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించారు.

పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed