CTET దరఖాస్తు తేదీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..

by Harish |
CTET దరఖాస్తు తేదీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) జనవరి 2024 న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) నిర్వహించడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా ఇటీవల దరఖాస్తు చివరి తేదీని పొడిగించారు. అప్లికేషన్ చివరి తేదీ: 27, నవంబర్ 2023. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన స్కోరును పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో నియామకాలు చేపడతారు. ఏటా రెండు సార్లు సీటెట్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష 20 భాషల్లో జరుగుతుంది. పేపర్-1,2 లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు స్కోర్ కేటాయిస్తారు.

సీటెట్ ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 3/11/2023

చివరి తేదీ: 27/11/2023

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 27/11/2023

CBT పరీక్ష తేదీ: 21/1/2024.

Advertisement

Next Story

Most Viewed