విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఓపెన్ ఇంటర్,టెన్త్ ఫలితాలు విడుదల

by Jakkula Mamatha |   ( Updated:2024-04-25 13:31:22.0  )
విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఓపెన్ ఇంటర్,టెన్త్ ఫలితాలు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గురువారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి 26 వరకు ఈ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 12 నుంచి 16 వరకు నిర్వహించారు. దీంతో అధికారులు తాజాగా ఫలితాలు ప్రకటించారు. పదో తరగతి పరీక్షలకు 32,581 మంది, ఇంటర్ పరీక్షలకు 73,550 మంది చొప్పున విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతిలో 18,185 మంది (55.81శాతం), ఇంటర్లో 48,377 మంది (65.77శాతం) ఉత్తీర్ణత సాధించారు.

ఏప్రిల్ 29 నుంచి మే 7 వరకు రీ వాల్యుయేషన్ / రీకౌంటింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 10 నుంచి 12 వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్ష ఫీజును ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు.

పది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://apopenschool.ap.gov.in/ లో, ఇంటర్ రిజల్ట్స్http://portal.apopenschool.org/aposs_results/APOSSRESULTSInter.aspx చెక్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed