AP Edcet - 2023 నోటిఫికేషన్ విడుదల

by Harish |
AP Edcet - 2023 నోటిఫికేషన్ విడుదల
X

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్‌లో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్) 2023 నోటిఫికేషన్‌ను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష వివరాలు:

ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్) 2023

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులు అర్హులే. ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్టులనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష ఫీజు: ఓసీలకు రూ. 650, బీసీలకు రూ. 500, ఎస్సీ/ఎస్టీలకు రూ. 450 ఉంటుంది.

దరఖాస్తు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 24, 2023

చివరి తేదీ: ఏప్రిల్ 23, 2023.

హాల్ టికెట్ల డౌన్‌లోడ్ : మే 12, 2023.

పరీక్ష తేదీ: మే 20, 2023.

వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in

Next Story

Most Viewed