ఎన్‌ఆర్ఎస్‌సీ విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టులు..!

by Anjali |   ( Updated:2023-12-09 11:43:03.0  )
ఎన్‌ఆర్ఎస్‌సీ విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తోన్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తాజాగా హైదరాబాదులోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)కు సంబంధించిన విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రకటన వివరాలు:

* టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్: 33 పోస్టులు

* టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్) 08 పోస్టులు

* టెక్నీషియన్- బిఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్): 09 పోస్టులు

* టెక్నీషియన్- బి (ఫొటో గ్రఫీ): 02 పోస్టులు

* టెక్నీషియన్-బి (డెస్క్‌ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్): 02 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 54.

ఎన్‌ఆర్ఎస్‌సీ పోస్టులకు అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయస్సు: 31.12.2023 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ. 21, 700-రూ. 69, 100

దరఖాస్తు ఫీజు: రూ. 600

పోస్టింగ్ స్థలం: ఎన్ఆర్ఎస్‌సీ-ఎర్ట్ స్టేషన్ (షాద్‌నగర్/బాలానగర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-సెంట్రల్ (నాగ్‌పుర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నార్త్ (న్యూ ఢిల్లీ), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - సౌత్ (బెంగళూరు).

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

అప్లికేషన్ ప్రారంభ తేది: 09. 12. 2023

అప్లికేషన్ చివరి తేదీ: 31. 12. 2023

Advertisement

Next Story

Most Viewed