విద్యకు మాత్రమే ఆ శక్తి ఉంది : సీఎం జగన్

by srinivas |   ( Updated:2020-09-08 03:14:46.0  )
విద్యకు మాత్రమే ఆ శక్తి ఉంది : సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పేదరికం, ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందన్నారు. ఇవాళ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి, సాధికారత చేకూర్చే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నారు.

అందుకోసమే రాష్ట్రంతో ప్రతిఒక్కరికీ విద్యను అందించేందుకు అమ్మఒడి, నాడు-నేడు, విద్యా దీవెన వంటి పథకాలను ప్రవేశపెట్టామన్నారు. వందశాతం అక్షరాస్యతను సాధించేలా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని’ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story