ఆ రెండు రంగాలను ప్రభుత్వ పరం చేయాలి

by Shyam |
ఆ రెండు రంగాలను ప్రభుత్వ పరం చేయాలి
X

దిశ ప్రతినిధి, మెదక్:
దుబ్బాక ఉప ఎన్నికలను ఈవీయంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని బహుజన్ ముక్తి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దాస్ రాం నాయక్ డిమాండ్ చేశారు. బహుజన శక్తుల ఉమ్మడి అభ్యర్థి వడ్ల మాధవ చారికి మద్దతుగా తొగుట మండలం వెంకట్రావు పేటలో ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్ రాం నాయక్ మాట్లాడుతూ.. విద్యా, వైద్యాన్ని ప్రభుత్వ పరం చేయాలన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు భూమి ఇవ్వాలని కోరారు. ప్రైవేట్ విశ్వ విద్యాలయాల్లో రిజర్వేషన్ లను అమలు చేయాలన్నారు. బహుజనుల ఉమ్మడి అభ్యర్థి మాధవచారి మాట్లాడుతూ…. వారసత్వ, మతతత్వ శక్తులకు ఓటు ద్వారా బుద్ది చెప్పాలని అన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed