- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ వాక్: సంక్షోభంలోనూ మేలైన దిగుమతి
ఈ ఐదు నెలలు అనగా జనవరి నుంచి మే వరకు రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు 286 శాతం పెరిగాయి. అంటే, 1,586 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన దిగుమతి జరిగింది. అదే సమయంలో బొగ్గు దిగుమతి 345 శాతం పెరిగి సుమారు 739 మిలియన్ అమెరికన్ డాలర్ల దిగుమతి జరిగింది. ఇతర పెట్రో ఉత్పత్తులు 570 శాతం పెరిగి సుమారు 889 మిలియన్ అమెరికన్ డాలర్లు దిగుమతి జరిగింది. ఇక ప్రాజెక్టు గూడ్స్ దిగుమతులు 53 శాతం పెరిగి 244 మిలియన్ అమెరికన్ డాలర్లు, సన్ ఫ్లవర్ ఆయిల్ 178 శాతం పెరిగి 242 మిలియన్ అమెరికన్ డాలర్లు దిగుమతి జరిగింది. గత 2021 సంవత్సరంతో పోలిస్తే, రష్యాతో భారత్ దిగుమతులు రెండు శాతం నుంచి ఏడున్నర శాతం పెరిగాయి. అదే సందర్భంలో కువైట్, నైజీరియా నుంచి మన దిగుమతులు తగ్గుముఖం పట్టాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఐదు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా యూరప్ ఖండంలో నాటో సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు రష్యాపై అనేక తీవ్రమైన ఆంక్షలు విధించాయి. అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచి ఈ యుద్ధం మరికొన్ని రోజులు సాగే విధంగా సహకరిస్తున్నాయి. అంతేకానీ, యుద్ధం నివారించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయడం లేదు. ఈ యుద్ధం రెండు కూటములు మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్గత ఆధిపత్య పోరుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సందర్భంలో రష్యాతో పాటు చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడటానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఈ అభివృద్ధి చెందిన దేశాలన్నీ ప్రపంచ ఆర్థిక సామాజిక వ్యవస్థలో అనేక మార్పులకు, ఒడుదుడుకులకు కారణమవుతున్నాయి.
గత రెండు దశాబ్దాలుగా ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచంలో అన్ని దేశాలు ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటున్నాయి. కాబట్టి ఎక్కడ ఏ దేశంలోనైనా చిన్న సమస్య వచ్చినా మొత్తం ప్రపంచం తల్లడిల్లుతున్నది. తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాలతో పాటు మన దేశం కూడా అనేక ఒడిదుడుకులను చవి చూస్తున్నది. ప్రపంచ దేశాలు మన దేశంపైన కొన్ని ఒత్తిడులు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, మన ప్రభుత్వం దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఒత్తిడులకు లోనుకాకుండా, రష్యాతో పలు వాణిజ్య వర్తక సంబంధాలు కొనసాగించడం మంచి నిర్ణయం. దీంతో మన విదేశీ నిల్వలు మరింత క్షీణించకుండా ఉన్నాయి. 2022 జనవరి నుంచి మునుపెన్నడూ లేని విధంగా రష్యాతో అనేక దిగుమతులు ఎక్కువగా, సరసమైన ధరలకు మనకు లభిస్తున్నాయి.
పెరిగిన దిగుమతులు
ఈ ఐదు నెలలు అనగా జనవరి నుంచి మే వరకు రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు 286 శాతం పెరిగాయి. అంటే, 1,586 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన దిగుమతి జరిగింది. అదే సమయంలో బొగ్గు దిగుమతి 345 శాతం పెరిగి సుమారు 739 మిలియన్ అమెరికన్ డాలర్ల దిగుమతి జరిగింది. ఇతర పెట్రో ఉత్పత్తులు 570 శాతం పెరిగి సుమారు 889 మిలియన్ అమెరికన్ డాలర్లు దిగుమతి జరిగింది. ఇక ప్రాజెక్టు గూడ్స్ దిగుమతులు 53 శాతం పెరిగి 244 మిలియన్ అమెరికన్ డాలర్లు, సన్ ఫ్లవర్ ఆయిల్ 178 శాతం పెరిగి 242 మిలియన్ అమెరికన్ డాలర్లు దిగుమతి జరిగింది.
గత 2021 సంవత్సరంతో పోలిస్తే, రష్యాతో భారత్ దిగుమతులు రెండు శాతం నుంచి ఏడున్నర శాతం పెరిగాయి. అదే సందర్భంలో కువైట్, నైజీరియా నుంచి మన దిగుమతులు తగ్గుముఖం పట్టాయి.ముఖ్యంగా గత సంవత్సరం నైజీరియా నుంచి దిగుమతులు 5.1 శాతం ఉండగా నేడు 3.3 శాతానికి తగ్గాయి. కువైట్ నుంచి గత సంవత్సరం దిగుమతులు 5.1 శాతం ఉండగా, ప్రస్తుతం 2.9 శాతానికి తగ్గాయి. మొత్తంగా గత సంవత్సరం రష్యా నుంచి మనం చేసుకున్న దిగుమతులు కేవలం ఒక శాతం నుంచి రెండు శాతం మధ్యన ఉండగా, ప్రస్తుతం నాలుగు శాతానికి పెరిగాయి. దీనికి కారణం ప్రపంచ దేశాల కంటే రష్యా మనకు తక్కువ ధరలకు సరఫరా చేయడం, మన రూపాయి మారకం ఆధారంగా వ్యాపారం చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం.
చైనాతో తగ్గుముఖం
ఇదే కాలంలో చైనాతో మన దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గత సంవత్సరంలో 15 శాతంగా ఉన్న వివిధ రకాల వస్తువుల దిగుమతులు నేడు 12 శాతానికి పడిపోయాయి. గతంలో మన దేశానికి రష్యా దిగుమతులు చేసే క్రమంలో 20వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం ఆరవ స్థానానికి చేరుకుంది. ఈ పెరుగుదల అంతా ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలలలోనే జరిగిన వాణిజ్య వర్తక సంబంధాలు ఆధారంగా నిర్ధారించినదే. ప్రస్తుతం మన దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రష్యాతో దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. అదే సందర్భంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అనేక రంగాలలో రష్యా మనకు ఆర్థిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించింది.
మన దేశ పాలకులు కూడా సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని చెబుతున్నారు. కావున రష్యా-ఉక్రెయిన్ దేశాలు అంతర్జాతీయ శాంతి ఒప్పందాలకు లోబడి ప్రపంచ పౌరుల సంక్షేమం కోసం సాధ్యమైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుందాం. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు, ఉభయ దేశాల శ్రేయస్సు కోరే దేశాలు ఈ యుద్ధం ముగించడానికి ముందుకు రావాలని ఆశిద్దాం.
ఐ. ప్రసాదరావు
99482 72919