- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్రవర్ణ పేదలకు అన్యాయం!
ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సామాజిక అసమానత్వం రూపొందే దిశగా అగ్రవర్ణ పేదలకు (ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు - EWS) 10 శాతం రిజర్వేషన్ చట్టం తేవడం జరిగింది. 2019 సంవత్సరంలో జనవరి 9న లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు పాసైన అనంతరం మూడు రోజుల వ్యవధిలోనే (జనవరి 12 న) అప్పటి రాష్ట్రపతి గౌరవ రాంనాథ్ కోవింద్‌చే గెజిట్ జారీ చేయడం ద్వారా జనవరి 14 న బిల్లు చట్టంగా రూపొందింది. తదనంతరం సుప్రీంకోర్టు ఆమోదం కూడా పొందింది.103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15 (6), 16 (6)లను అనుసరించి అన్ని రాష్ట్రాలలోనూ, దేశంలోని ఎయిడెడ్ ప్రైవేట్, అన్ ఎయిడెడ్ విద్యాలయాలలోనూ, ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్‌ని అగ్రవర్ణ పేదలకు కేటాయించడం జరిగింది. అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో అగ్రవర్ణ పేదలు కాకుండా అగ్రవర్ణాల్లోని ఉన్నత స్థాయి వ్యక్తులు అంటే ప్రభుత్వ చట్టం నిర్దేశించిన నియమాలను అతిక్రమించి తమ పలుకుబడిని ఉపయోగించుకొని తాహసిల్దార్ కార్యాలయాలలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పొందుతున్నట్టు సమాచారం. దీనివల్ల అగ్రవర్ణంలోని పేదలకు ఈ చట్టం ప్రయోజనాలు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే ఇటువంటి తప్పుడు సర్టిఫికెట్ల జారీ పైన నిఘా ఉంచి పారదర్శకతతో అగ్రవర్ణ పేదలకు ఆ సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి, అప్పుడే నిజమైన అర్హులు లబ్ధి పొందుతారు, చేసిన చట్టానికి ఫలితం కూడా ఉంటుంది.
కల్లెట్ల అరుణ్ సాగర్
సహస్ర వేదిక్ సేవా సమితి ఫౌండర్
99591 79954
- Tags
- EWS certificate