మైదా.. ఆరోగ్యానికి హానికరం!

by Ravi |   ( Updated:2023-06-14 22:30:28.0  )
మైదా.. ఆరోగ్యానికి హానికరం!
X

నేటి ఆధునిక కాలంలో ప్రతి మనిషి ఏదో ఒక జబ్బు తో బాధపడుతున్నాడు ముఖ్యంగా యుక్త వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు..దీనికి కారణం జీవనశైలి, శరీరానికి తగిన శ్రమ, వ్యాయాయం లేకపోవడమే. గతంలో విద్యార్థి దశలో ఏదో ఒక శారీరక శ్రమతో కూడిన ఆటలు ఆడేవారు. కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం లేదా ఆన్‌లైన్ ఆటలు, బెట్టింగ్‌లో పాల్గొనడం వలన స్థూలకాయం వస్తుంది. ఏ వస్తువు కావాలన్న ఆన్ లైన్‌లో బుక్ చేసుకుంటూ నడక మరిచిపోవడం వలన కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మైదాతో చేసిన బిస్కెట్లు, కేకులు, పిజ్జా, బర్గర్ భుజించడం, రాత్రిపూట ఎక్కువ సేపు సమయం గడపడం, అధిక మోతాదులో మత్తు పానీయాలు, ధూమపానం సేవించడం వలన కూడా కొవ్వు పెరిగే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ పెరగడంతో గుండె జబ్బులు తో పాటు పక్షవాతం, కాలేయ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. బిస్కెట్లు, కేకులలో ట్రాన్స్ బాట్ అధికంగా ఉండటంతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అప్పడాలు, వడియాలను కల్తీ నూనె ఉపయోగించడం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం..

కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే పండ్లు, కూరగాయలు, ఎక్కువగా వాడాలి. డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు తక్కువగా తీసుకుంటూ మానసిక ఒత్తిళ్లకు తగ్గించుకుంటూ, వ్యాయామం, ధ్యానం లాంటివి చేస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఉప్పు, పంచదార తగ్గించుకోవడంతో పాటు, మైదాతో చేసే పదార్థాలు తినకుండా ఉండాలి. మైదా అనేది తినే ఆహార పదార్థం కాదని ఆరోగ్య నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ఇందులో ఎటువంటి పోషక పదార్థాలు ఉండవని తెలిసినను హోటల్, టిఫిన్ సెంటర్‌లలో మైదాతో చేసే పూరీలు, బోండాలను ఎక్కువగా తింటున్నారు ప్రజలు. దీనివల్ల ప్రజలకు జీర్ణకోశ వ్యాధులు సంక్రమించే ప్రమాదముంది.

మైదా గోధుమల నుండి తయారు చేసే విధానంలో చాలా మార్పులు చేస్తారు. ప్రథమంగా గోధుమలపై పొట్టు తొలగించి, విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు వుండే గింజను తీసి పిండిని శుద్ధి చేసి రసాయనాలు కలపడం వలన తెల్లగా, మెత్తగా ఆకర్షణీయంగా ఉండేందుకు అలోక్సన్, అజోడికార్బోనో మైడ్, క్లోరిన్ గ్యాస్, బొంజోల్ పెరాక్సైడ్ అనే విషపూరిత రసాయనాలు కలుపుతారు. చివర్లో పోటాషియం బ్రోమేట్ కలపడంతో మానవుని శరీర కణాలు నశింపజేస్తుంది. అలాగే ఈ బ్రోమేట్ వాడకం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని కొన్ని దేశాలు నిషేధించాయి. మైదా అనేది ఒక రకమైన క్రిమి-సంహరకారిగా ఉండటం వలన మైదా తినే కీటకాలు చనిపోతున్నాయు. ఇంతటి విషపూరిత మైదాతో బిస్కెట్లు, చాక్లెట్, బ్రెడ్, కేక్స్, బన్ లాంటివి తినడం వలన పిల్లలకు చిన్నతనంలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. నగరాల్లో నివసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉదయం లేవగానే పరుగుల జీవితాలకు అలవాటుపడ్డ వీరికి హోటల్స్, హాస్టల్, టిఫిన్ బండ్ల వద్ద దొరికే పూరి, బోండాలు, సమోసాలే శరణ్యం. కావున మైదాతో చేసే పదార్థాలు సేవించకుండా వాటికి దూరంగా ఉండాలి. జీవనశైలి, ఆహార అలవాట్లు, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడక, తేలికపాటి వ్యాయామం చేస్తే కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Advertisement

Next Story

Most Viewed