కొలువులకై కోటి ఆశలతో..

by Ravi |   ( Updated:2025-03-10 00:30:06.0  )
కొలువులకై కోటి ఆశలతో..
X

తెలంగాణా రాష్ట్రంలో నీళ్లు, నిధుల కోసం నాయకులు కొట్లా డితే.. కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. రాష్ట్రం వస్తే కోరుకున్న కొలు వు వస్తదని, గొప్పగా బతుకుతామని విద్యార్థులు తమ జీవితాలని లెక్క చేయకుండా, ప్రాణాలని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఇది సాధ్యం కాలేదు. అందుకే కొత్త ప్రభుత్వమైనా ప్రత్యేక రాష్ట్రంలో ప్రతీ విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలి. అయితే, కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడగానే 55 వేల ఉద్యోగాలను పూరించింది. అవన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 12 వేల ఉద్యోగాలనే భర్తీ చేసింది. మరీ ఆ పార్టీ ఎన్నికల్లో హమీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియక నిరుద్యోగులు నిరాశలో ఉన్నారు. పైగా ఇటీవల ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతున్నదని వస్తున్న వార్తలతో నిరుద్యోగులలో తీవ్ర నిరాశ నెలకొన్నది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నిరాశనీ, అసంతృప్తినీ, అందోనళనీ, భయాన్ని అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని, ఖాళీ అయ్యే ముందు రోజు వరకే ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి. ఉద్యోగాల భర్తీనీ వెంటనే అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి, యుద్ధ ప్రాతిపదికన ఉద్యో గాల భర్తీ చేయాలనీ నిరుద్యోగులంతా ప్రజా ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటా యి కాబట్టి ప్రయివేట్ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలని, ప్రోత్సహాకాలని అందించాలి. ప్రయి వేటు ఉద్యోగాలలో 75% ఉద్యోగాలు స్థానికులకి దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. పరిశ్రమలు కోరుకుంటున్న, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్య వ్యవస్థని సమూలంగా మార్చాలి. ప్రతి సంవత్సరము బడ్జెట్లో 3% నిధులని ప్రత్యేకంగా కేటాయించాలి. అలాగే పరిశ్రమలు పెట్టేందుకు తెలంగాణ బిడ్డలకి బ్యాంకు రుణాలు అందేలా చూడాలి. అప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది.

- శ్రవణ్ కుమార్,

76718 18367

Next Story