- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్తీక పౌర్ణమి విశిష్టత తెలుసా?
కార్తీక పౌర్ణమి శివునికి ప్రీతిపాత్రం. ముక్కంటి త్రిపురాసుడిని హతమార్చిన దినం. పార్వతి దేవి పాప పరిహారార్థం శివారాధన చేసిన దినం. బౌద్ధులకు చాతుర్మాస్య వ్రతారంభదినం. ఇలా ఐదు దినాలను పంచ పర్వాలుగా ఆచరించడం సనాతన సాంప్రదాయాచారం. దేవాలయాలలో మూల విరాట్టుల అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజలు చేస్తారు. భక్తులు ఆలయాల మధ్య గల ఉసిరిక వృక్షం చుట్టూ సాంప్రదాయ ప్రదక్షిణలు ఆచరించి, ఉసిరికలను దానం చేసుకుని కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలొనరిస్తారు. మంగళ స్నానాలాచరించి, దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలి పెడతారు.
అన్ని మాసములలోనూ కార్తీకమాసం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతున్నది. 'న కార్తీక సమో మాస' అన్నారు అత్రి మహాముని. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని దీని అర్థం కార్తీకంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధనం, దీపదానం, తులసి మాలధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వన భోజనం మున్నగునవి.
వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసం పౌర్ణిమ రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. ' చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కావడంతో దానిని 'కార్తీక మాసం' అంటారు.
విశేష పుణ్య ఫలముగా
'అంబా దులా నితంతీ చ, అభ్రయంతి తథైవ చ, వర్షయంతి చపూణికా చ, షడ్ ఏతే కృత్తికా స్మృతా' అంబా, దులా, నితంతీ, అభ్రయంతీ, వర్షయంతీ, చుపూణికా అని పిలవబడే షట్కృత్తికలు కార్తీకానికి అధిపతులు. కృత్తికా నక్షత్రము కృత్తికలకు అధిష్టానము, అగ్ని స్వరూపము. అశ్విన్యాది 27 నక్షత్రములు దేవతలకు ఇంద్రియములుగా చెప్పబడ్డాయి. 'నక్షత్రం దేవమింద్రియం' అని శ్రుతి. వాటిలో అతి ముఖ్యమైన తేజస్సును దేవతలకు అందించే నక్షత్రం కృత్తిక. అట్టి కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణిమాస్య కలిగిన ఈ మాసము కార్తీక మాసముగా, విశేష పుణ్య ఫలదముగా చెప్పబడింది. చాంద్రమాన రీత్యా ఎనిమిదవ మాసమైన కార్తీకమునకు ఒక విశేష స్థానము కలదు.
శరదృతువు ఉత్తర భాగములో వచ్చే కార్తీక మాసము నెల రోజులు పర్వదినాలుగానే భావిస్తారు. ప్రత్యేకించి కార్తీక శుక్ల ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పంచ పర్వాలుగా భావించబడతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి-ఉత్థాన ఏకాదశి ప్రత్యేకతననుసరించి, ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతముగా చెప్పబడుచున్నవి. మహావిష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థానము చెందును. కావున దీనిని ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
Also read: సకల శుభాల విజయదశమి!
పంచ పర్వాలుగా ఆచరిస్తూ
పీఠాధిపతులు, యతీశ్వరులు, మునులు ఈ వ్రతమును ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆహార నియమాలతో చేయడం జరుగుతున్నది. కార్తీక శుద్ధ ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి లేదా ప్రభోదనైకాదశి అంటారు. ప్రబోధనైకాదశి నాడు విష్ణుమూర్తి క్షీరాబ్ది నుండి బయలు దేరి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు, లేదా మదన ద్వాదశి, యోగిని ద్వాదశి నాడు విష్ణువు, లక్ష్మి, బ్రహ్మ మున్నగువారితో కలిసి బృందావనంలో ప్రవేశిస్తాడు. దీనిని క్షీరసాగరాన్ని మధించిన, చిలికిన దినంగా వ్యవహరిస్తారు. అమదేర్ జ్యోతిషీ గ్రంథ ప్రకారం చాతుర్మాస్య వ్రత సమాపన దినం. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రం కార్తీక శుద్ధ త్రయోదశి.
విష్ణువు శంకరుడిని పూజించిన దినం వైకుంఠ చతుర్దశి. ఇది జాగరణ వ్రతం, ప్రతిమ వ్రతం, లింగ వ్రతం, ప్రబోధ వ్రతాలకు ఉద్దీపితమైనది. కార్తీక పౌర్ణమి శివునికి ప్రీతిపాత్రం. ముక్కంటి త్రిపురాసుడిని హతమార్చిన దినం. పార్వతి దేవి పాప పరిహారార్ధం శివారాధన చేసిన దినం. బౌద్ధులకు చాతుర్మాస్య వ్రతారంభదినం.ఇలా ఐదు దినాలను పంచ పర్వాలుగా ఆచరించడం సనాతన సాంప్రదాయాచారం. దేవాలయాలలో మూల విరాట్టుల అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజలు చేస్తారు. భక్తులు ఆలయాల మధ్య గల ఉసిరిక వృక్షం చుట్టూ సాంప్రదాయ ప్రదక్షిణలు ఆచరించి, ఉసిరికలను దానం చేసుకుని కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలొనరిస్తారు. మంగళ స్నానాలాచరించి, దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలి పెడతారు.
Also read: దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494