ఓటు హక్కు విలువ తెలుసా?

by Ravi |   ( Updated:2024-02-03 13:26:20.0  )
ఓటు హక్కు విలువ తెలుసా?
X

సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటు వజ్రాయుధం. ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి ఓటు ఎంతో కీలకం. ఓటు హక్కు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి గతులను మార్చే శక్తి ఓటుకు ఉంది. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెంది మనం బాగు పడాలి అనే తాపత్రయం ఉండటమే కాదు. ఓటు ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిస్థితి, స్వార్థ రాజకీయాల కోసం కోట్ల రూపాయల డబ్బు ఉంటే చాలు ఎన్నికలలో టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నోటును ప్రజలకు పంచి బలహీనపరిచి, గెలుపును పటిష్టం చేసుకుంటున్నాయి కొన్ని పార్టీలు.

టు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరు తన ఓటును ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలి. ఓటు హక్కు ఎంతో పవిత్రమైనది దానికి ఎంతో సార్థకత ఉంటుంది. విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దు. ఓటు విలువైన ఆయుధం. ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వమే 'ప్రజాస్వామ్యం'. మన దేశం సర్వ స్వతంత్ర, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక దేశం. దేశంలోని ప్రతి ఒక్కరూ సమానం. అందరికీ సమాన స్వేచ్ఛ, హక్కులు రాజ్యాంగం ప్రకారం ఉంటాయి.

దేశ చరిత్రను మార్చేది

1907లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వేసిన 'రాయల్‌ కమిషన్‌' సిఫారసుల ఆధారంగా 1909 'కౌన్సిల్‌ చట్టం' ప్రాతిపదికన భారతీయులకు తొలిసారిగా ఓటు హక్కు కల్పించారు. దీనిని మరింతగా విస్తృత పరిచి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ హక్కును 10.6 శాతానికి పెంచారు. రాజ్యాంగ పరిషత్‌, ఎన్నికల సందర్భంగా 28.5 శాతం ప్రజలకు దీనిని విస్తరింపచేశారు. ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి భారత రాజ్యాంగం భారత పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి 352 అధికరణ ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంతం, లింగ భేదాలు వంటి తేడాలతో ఏ ఒక్కరికీ ఓటు హక్కు నిరాకరించకూడదంటూ నిబంధనలు జారీ చేసింది.

326 వ అధికరణ ప్రకారం 'సార్వత్రిక వయోజన ఓటు హక్కు' కల్పించింది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. ప్రజాస్వామ్య మనుగడ కాపాడుకోవడానికి 'ఓటు' అనే రెండక్షరాలకు దేశ చరిత్రనే మార్చేస్తుంది. అందుకే దేశంలోని ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 326 ప్రకారం కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికి ఓటు హక్కు కల్పించారు. దీంతో సమర్థులైన పాలకులను ఎన్నుకునే అవకాశం ఉంది. ఓటును దుర్వినియోగం చేయకుండా సమర్థ నాయకుడిని ఎన్నుకోవాలి.

Also read: ఇదీ సంగతి: అధికారం కోసమేనా రాజకీయ పార్టీల బతుకు?

నోటును నినాదంగా మార్చి

సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటు వజ్రాయుధం. ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి ఓటు ఎంతో కీలకం. ఓటు హక్కు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి గతులను మార్చే శక్తి ఓటుకు ఉంది. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెంది మనం బాగు పడాలి అనే తాపత్రయం ఉండటమే కాదు. ఓటు ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిస్థితి, స్వార్థ రాజకీయాల కోసం కోట్ల రూపాయల డబ్బు ఉంటే చాలు ఎన్నికలలో టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నోటును ప్రజలకు పంచి బలహీనపరిచి, గెలుపును పటిష్టం చేసుకుంటున్నాయి కొన్ని పార్టీలు.

నోటుని నినాదంగా ఏర్పరచుకొని ఓటుని వాళ్లకి అనుగుణంగా మార్చుకుంటున్నాయి ఇంకొన్ని పార్టీలు. నోటు తీసుకుని ఓటు వేసి ప్రశ్నించే హక్కుని కోల్పోతున్నాము. డబ్బుకు అమ్ముడుపోయి అవినీతి కుళ్లు రాజకీయాలకు ప్రజలను తప్పుడు దారిలోకి తీసుకుపోతున్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా, సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలంటే. మన జీవితాలను, తలరాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయించి నాయకుల తలరాతలను మారుస్తుంది. ఓటు దేశ దిశ, దశను మారుస్తుంది.

Also read: తెలంగాణ తొలి గ్రంథాలయం గురించి తెలుసా

తీగల అశోక్ కుమార్

తెలంగాణ ఉద్యమకారుడు

79891 14086

Advertisement

Next Story

Most Viewed