దార్శనికత తోనే ఉజ్వల భవిత..

by Ravi |   ( Updated:2024-12-13 00:45:56.0  )
దార్శనికత తోనే ఉజ్వల భవిత..
X

కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్-2047 ప్రణాళికతో ముందుకు సాగుతుండగా, 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు రాష్ట్రం తన విజన్-2047ను సిద్ధం చేస్తోందని రాష్ట్రం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవటానికి ఏపీ బ్రాండ్‌ను నిర్మించేందుకు సరళమైన ప్రభుత్వం, సమర్థవంతమైన పాలన ఈ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ఇంధన వనరుల వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు మరియు బ్రాండింగ్‌తో సహా 10 కీలక సూత్రాలను. స్వచ్ఛ ఆంధ్ర, మరియు డీప్ టెక్. వంటి కీలక సూత్రాలు, విజన్ 2047 కీలక లక్ష్యాలు.

ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించబదినది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం “స్వర్ణాంధ్ర విజన్-2047” ముసాయిదా పత్రాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు అందించింది. నీతి ఆయోగ్‌తో సహా ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో ఈ పత్రం అభివృద్ధి చేయబడుతోంది. విజన్ డాక్యుమెంట్ ఈ లక్ష్యాలను సాధించడానికి రోడ్‌మ్యాప్‌ను కూడా స్పష్టంగా వివరిస్తుంది. రాష్ట్రం మొత్తా నికి మాత్రమే కాకుండా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల అభివృద్ధికి కూడా సిద్ధమవుతోంది.. ప్రజలతో సంప్రదింపుల ఆధారంగా, దృష్టిని ముందుకు నడపడానికి ప్రభుత్వం “పది సూత్రాలు” లేదా 10 మార్గదర్శక సూత్రాలను అభివృద్ధి చేసింది.

17 లక్షలమంది భాగస్వామ్యం

జీరో పేదరికం, ఉపాధి, నైపుణ్యం & మానవ వనరులు నైపుణ్యాభివృద్ది, నీటి భద్రత, అగ్రి-టెక్‌తో రైతు సాధికారత, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, ఎనర్జీ & ఇంధన ధర ఆప్టిమైజేషన్, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర ప్రభావం కోసం లోతైన సాంకేతికత. "పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధి, ఉపాధి కల్పన వీటి ప్రధాన లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ స్వర్ణ ఆంధ్ర-2047 విజన్ 4.0 'సంపన్న, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్' అనే నినాదంతో విజన్ డాక్యుమెం ట్‌ను రూపొందించారు. “పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యాలతో పాటు మానవ వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణ, వ్యవసాయం స్వచ్ఛాంధ్రలో సాంకేతికతను ప్రవేశపెట్టడం వారి విలువైన సూచనలను పరిగణనలోకి తీసుకుని 17లక్షల మందిని భాగస్వాములను చేయడం వంటి 10 సూత్రాల‌తో విజన్ డాక్యుమెంట్ రూపొందించబడింది.

గ్రామాలు ప్యూచర్ బిల్టింగ్ బ్లాక్‌లు..

ఒక రకంగా చెప్పాలంటే ఇది రాష్ట్ర భవిష్యత్తు పట్ల ప్రజల దృక్పథం'' మానవ వనరుల అభి వృద్ధి, నైపుణ్య శిక్షణలో క్రమం తప్పకుండా ప్రాక్టీస్ అవసరమని సీఎం భావించారు. పారిశ్రామిక పార్కులు, మహిళల MSME పార్కులు, అనువైన వర్కింగ్ మోడల్స్, కుటుంబ-స్నేహపూర్వక వర్క్‌ప్లేస్‌లు వ్యాపా రాన్ని వేగవంతం చేసేందుకు వీలుగా సరళీకృత విధానాలను ఆయన వివరించారు. వ్యవసాయంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గించి పెంచే దిశగా పలు వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల యాజమాన్యపు మెళుకువలు, అధునిక సాంకేతికను వ్యవసాయానికి జోడిం చటం, నీటి భద్రత, ఇంధనం రూపంలో కాస్ట్ ఆప్టిమైజేషన్, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ వంటి టెక్నాలజీల వినియోగం, గ్రామాలను రాష్ట్ర భవిష్యత్తుకు బిల్డింగ్ బ్లాక్‌లుగా మార్చడం వంటి వాటిపైవాటిపై దృష్టి సారించనున్నారు రాష్ట్రం లో తయారయ్యే ఉత్పత్తులన్నీ కచ్చితంగా నిర్దిష్ట బ్రాండ్‌ను పొందాలి. ఉత్పత్తులకు బ్రాండ్ లేనందున ఏపీకి అదనపు ఆదాయం రావడం లేదు అన్నది ఆర్దిక నిపుణుల అభిప్రాయం.

సున్నా పేదరికమే లక్ష్యం

పట్టణ ప్రాంతాలలో వృద్ధిని మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతా లను సమానంగా అభివృద్ధి చేయడమే. ఆర్థిక వృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అనువదించే సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విజన్ డాక్యుమెంట్ సాధించడానికి నిర్దిష్ట లక్ష్యాలతో 10 ఆంశాలు కలిగి ఉంటుంది. 2047 నాటికి సున్నా పేదరికాన్ని సాధించడం మొదటి లక్ష్యం . ప్రజలు, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రతిపాదించారు. విజన్ డాక్యుమెంట్‌లో ఉపాధి అవకాశాల కల్పన, మానవ వనరుల నైపుణ్యం తదుపరి దృష్టి కేంద్రాలు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా నీటి భద్రతను సాధించాలన్నది నిర్దేశితలక్ష్యం. వ్యవసాయంలో సాంకేతికతను అనుసంధానం చేయడం. నీటి భద్రతను నిర్ధారించడం ద్వారా రైతుల ఉత్పాదకత, లాభదాయకత పెరుగుతుంది ఆభివృద్ధి దిశగా పురోగమించాలంటే , 'స్వర్ణాంధ్ర విజన్-2047' విధానం పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారు తుంది. వృద్ధి చక్రానికి ఆజ్యం పోస్తుంది"ప్రణాళిక బద్దమైన పరిపాలన పారదర్శక ప్రభుత్వ విధానాలు దార్శనికత వెరసి ఉజ్వల భవితకు పునాది వేస్తాయి.

సుధాకర్

99898 55445

Advertisement

Next Story

Most Viewed