అది ముమ్మాటికీ పరువు హత్యే

by Ravi |   ( Updated:2022-09-03 17:01:42.0  )
అది ముమ్మాటికీ పరువు హత్యే
X

పరువు హత్యకు పాల్పడడం వలన పరువు తిరిగి పొందావా?' అని మోబిన్‌ను ప్రశ్నిస్తున్నది అశ్రిన్. 'ఏ మత గ్రంథం అయినా సమానత్వాన్ని ప్రబోధిస్తుంది. అది కాదని హత్య ఎందుకు చేశావు?' అని రోధిస్తున్నది. 'ఇలాంటి ఎన్ని హత్యలు జరిగినా ప్రభుత్వానిది ప్రేక్షక పాత్రేనా?' అని నిలదీస్తున్నది. 'మాలాంటి వారికి రక్షణ కలిపించే పాలసీ ప్రభుత్వం దగ్గర ఉందా?' అని అడుగుతున్నది. అలాగే, 'పౌర సమాజం స్పందన తీరు కూడా ఇదేనా?' అని కూడా నిగ్గదీస్తున్నది. ప్రభుత్వం కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక్కోదానిలో ఒక్కో విధంగా, స్వార్థపూరితంగా ఉండటంలోని ఆంతర్యమేమిటో చెప్పాలంటున్నది.

టీవల నగరంలోని సరూర్‌నగర్‌లో జరిగిన జల్లిపురం నాగరాజు హత్య ముమ్మాటికీ పరువు హత్యే. దాంతో ఏ మతానికీ సంబంధం లేదు. ఈ హత్యకు సంబంధించి పౌరహక్కుల సంఘం బృందం నిజ నిర్ధారణ జరిపింది. నాగరాజు కుటుంబాన్ని ఆయన భార్య అశ్రిన్ సుల్తానాను కలిసి వివరాలు సేకరించింది. ఆశ్రిన్, నాగరాజు పదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమవారిని ఒప్పించి పెండ్లి చేసుకోవాలని అనుకున్నారు. వారు అంగీకరించకపోవడంతో జనవరిలో ఆర్య సమాజ్ లో పెండ్లి చేసుకున్నారు.

తాము కుదిర్చిన వ్యక్తిని కాదని నాగరాజును చేసుకుందని దీంతో అశ్రిన్ కుటుంబీకులు ఆగ్రహానికి గురయ్యారు. ఆమె అన్న మోబిన్, అతని బావ మసూద్ కలిసి విచక్షణా రహితంగా ఇనుప రాడ్డుతో నడిరోడ్డు మీద నాగరాజును కొట్టి చంపారు. సయ్యద్ మోబిన్ మొదటి నుంచి ఈ విషయమై తన చెల్లిని కొడుతూ హింసించేవాడు, వారి తండ్రి కూడా కొడుకు కొట్టిన దెబ్బలకు చనిపోయాడు. తమ్ముడిని సైతం నిత్యం కొడుతుంటాడు. తల్లిని మానసిక వేదనకి గురిచేసేవాడు. తను కుదిర్చిన సంబంధం కాకుండా వేరే కులస్థుడిని, మతస్థుడిని పెండ్లి చేసుకోవడం వలన పరువు పోయిందని బాహాటంగానే చెప్పేవాడు. సమాజంలో ఉన్న భూస్వామ్య భావజాలం, కులమతాల అంతరాలు, వీటి అడ్డుగోడలు, పరిధులను అమ్మాయిలు దాటడాన్ని పురుషులు 'పరువు పోయినట్టు'గా చిత్రీకరించడం వలన ఈ హత్యలు జరుగుతున్నాయి.

ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి

ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో అధికమయ్యాయి. వీటి నుంచి ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవడం లేదు. కేవలం ఆర్థిక సహాయం అందించి చేతులు దులుపుకుంటున్నాయి. నిజానికి 'ప్రభుత్వాలు కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి. సమాజాన్ని ప్రజాస్వామీకరించాలి. సమానత్వాన్ని సాధించాలి' అని రాజ్యాంగం ఘోషిస్తున్నది. అయినా, రాజ్యాంగ లక్షణాలను నిలబెట్టడానికి ప్రభుత్వాలు పని చేయడం లేదు. అవి తమ బాధ్యతల నుండి వైదొలిగాయి. ఇలాంటి వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం వరకే ఆలోచించి, వారి రక్షణను మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇలాంటి వారికి రక్షణ కల్పించడం కోసం ప్రత్యేక కృషి చేయాలి. 'పరువు హత్యకు పాల్పడడం వలన పరువు తిరిగి పొందావా?' అని మోబిన్‌ను ప్రశ్నిస్తున్నది అశ్రిన్.

'ఏ మత గ్రంథం అయినా సమానత్వాన్ని ప్రబోధిస్తుంది. అది కాదని హత్య ఎందుకు చేశావు?' అని రోధిస్తున్నది. 'ఇలాంటి ఎన్ని హత్యలు జరిగినా ప్రభుత్వానిది ప్రేక్షక పాత్రేనా?' అని నిలదీస్తున్నది. 'మాలాంటి వారికి రక్షణ కలిపించే పాలసీ ప్రభుత్వం దగ్గర ఉందా?' అని అడుగుతున్నది. అలాగే, 'పౌర సమాజం స్పందన తీరు కూడా ఇదేనా?' అని కూడా నిగ్గదీస్తున్నది. ప్రభుత్వం కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక్కోదానిలో ఒక్కో విధంగా, స్వార్థపూరితంగా ఉండటంలోని ఆంతర్యమేమిటో చెప్పాలంటున్నది. 'ఈ ఘటనలో హంతకుడు మోబిన్‌ను కఠినంగా శిక్షించాలి. రక్షణ కల్పించాలని దరఖాస్తు చేసినా పట్టించుకోని పోలీసులనూ శిక్షించాలి. ప్రేమ వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించాలి. అశ్రిన్‌ను, నాగరాజు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి' అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి మత విద్వేషాలకు దూరంగా ఉండాలని సమాజానికి విన్నవిస్తున్నాం.

తెలంగాణ పౌర హక్కుల సంఘం

హైదరాబాద్

Advertisement

Next Story

Most Viewed