RSS: గోవా స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత?

by Ravi |   ( Updated:2022-12-17 18:45:41.0  )
RSS: గోవా స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత?
X

ఆజాద్ గోమంతక్ దళ్‌లో సభ్యులు మోహన్ రానడే అతని స్నేహితుడు తేలు మాస్కురానాస్ గోవాలో ఆ తరువాత వివిధ పోర్చుగీస్ జైళ్లలో 1969 వరకు శిక్ష అనుభవించారు .ప్రముఖ సంగీత దర్శకుడు స్వయంసేవక్ అయిన సుధీర్ ఫడ్కే ప్రయత్నాల మూలంగా చివరికి వారు విడుదల అయ్యారు. స్వాతంత్ర్య యోధుడు మోహన్ రానడే తన `సర్ఫరోషీ కీ తమన్నా'అనే పుస్తకంలో పోర్చుగీసు కాలనీలను విముక్తం చెయ్యడానికి జరిగిన అనేక ప్రయత్నాలను నెహ్రూ ఏ విధంగా నీరుగార్చారో ఆ పుస్తకంలో వివరించారు. ఈ విముక్తి పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు పాల్గొన్నారని మోహన్ రానడే చెప్పడం జరిగింది. భారతదేశ సార్వభౌమత్వం పరిరక్షణలో స్వయంసేవకుల త్యాగాలు మరువలేనివి

నం ఎప్పుడూ బ్రిటిష్ పాలన నుంచి భారత్ ఎలా విముక్తి పొందిందనే విషయాన్నే చర్చిస్తుంటాం. కానీ, పోర్చుగీసు, ఫ్రెంచ్ పాలన నుంచి గోవా తదితర ప్రాంతాలు ఎలా విముక్తమయ్యాయనే సంగతి పెద్దగా పట్టించుకోము. నిజానికి 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 యేళ్లకుగానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నేతలు పోర్చుగీస్ కాలనీలు గోవా, డయ్యూ , డామన్ దాద్రా, నగర్ హవేలి, ఫ్రెంచ్ కాలనీ పాండిచ్చేరి (ఇప్పుడు పుదుచ్చేరి) సంగతి మర్చిపోయారు కానీ, మాతృభూమి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన ఆర్‌ఎస్‌ఎస్(RSS) మాత్రం మర్చిపోలేదు. గోవా విముక్తి పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు.

1961, డిసెంబర్ 19న గోవా విదేశీ పాలన నుంచి బయటపడింది. గోవాలో పోర్చుగీసు పాలన అంతం కావాలని ఆ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చెయ్యాలని 1955లో ఆర్‌ఎస్‌ఎస్ కోరింది. ఈ విషయంలో సైనిక బలగాలను ఉపయోగించడానికి నెహ్రూ నిరాకరించడంతో ఆర్‌ఎస్‌ఎస్, రాష్ట్ర సేవికా సమితికి చెందిన కార్యకర్తలు జగన్నాథరావు జోషితో పాటు ఐదు వేల మందితో 1955 జూన్ 15న సత్యాగ్రహం ప్రారంభించారు. ఇందులో మూడు వేల మంది మహిళలు కూడా పాల్గొన్నారు. 1955 ఆగస్ట్ 15న పోలీసులు జరిపిన కాల్పులతో 50 మంది పౌరులు చనిపోయారు. అనేకులు తుపాకి గుండ్ల దెబ్బలు తిన్నారు. అనేక మంది పోర్చుగీసు జైళ్లలో అమానుష చిత్రహింసలను అనుభవించారు.

అతను స్వయం సేవకుడే

1955లో పనాజీ సచివాలయం మీద మొట్టమొదటి సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి గోవాలో అధ్యాపకునిగా పనిచేస్తున్న ఒక స్వయంసేవక్. 1961లో 'గోవా విముక్తం' అయిన తరువాత కూడా మొత్తం 17 సంవత్సరాల పాటు ఆయన లిస్భన్ జైలులో ఉన్నాడు. గోవా విముక్తికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి సాగించిన జాతీయ పోరాటంలో స్వయంసేవకులు ప్రధాన పాత్ర నిర్వహించారు. దేశం నలుమూలల నుండి వెల్లువలా వస్తున్న సత్యాగ్రహులకు గోవా సరిహద్దు వెంబడి భోజన వసతి సమకూర్చే కార్యాన్ని స్వయంసేవకులు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. సంఘ్, జనసంఘానికి చెందిన ప్రముఖ కార్యకర్తలు అనేక సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించారు. సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించిన ప్రముఖ స్వయంసేవకులలో మద్యభారత్ బృందానికి నాయకత్వం వహించిన ఉజ్జయినికి చెందిన రాజాభావు మహంకాళ్ ఒకరు. సరిగ్గా సరిహద్దులలోనే పోర్చుగీస్ పోలీసులు తమ తుపాకులు, తూటాలతో ఈ సత్యాగ్రహాలకు 'స్వాగతం' పలుకడానికి సిద్ధంగా ఉన్నారు.

రాజాభావు గోవా సరిహద్దు వైపు సాగుతున్నంతలోనే సత్యాగ్రహుల మొదటి మూడు వరుసలపై కాల్పులు జరిగాయి. వారు గాయపడి నేలకూలారు. మూడు వరుసలలో ఉన్న సాగర్ ప్రాంతానికి చెందిన సాహసి సహోదరాదేవి గాయపడి క్రింద పడిపోగానే రాజాభావు ఆమె చేతుల్లోని త్రివర్ణ పతాకాన్ని తానందుకుని 'భారత మాతాకీ జయ్' అని గర్జిస్తూ ముందుకు దూకారు. అంతలోనే దూసుకువచ్చిన ఒక బుల్లెట్ వారి కంటిని చీల్చుకుపోగా వారు నేలకూలారు. స్పృహలో ఉన్న కొద్ది క్షణాలలోనే పతాకాన్ని, గాయపడిన సత్యగ్రహులను జాగ్రత్తగా చూసుకోమని ఇతరులకు ఆదేశాలు ఇచ్చారు. మరికొన్ని నిమిషాలలోనే మాతృభూమి స్వాతంత్య్ర సాధనా కార్యంలో అజరామరమైన ఘనతను సాధించుకున్న అమరవీరుల వరుసలో వారు కూడా చేరిపోయారు.

వారిదే ముఖ్య పాత్ర

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలయినా రాజావాకన్ కర్ నానా కజ్రేకర్ 1954లో దాద్రా, నగర్ హావేలీ, డామాన్‌లకు అనేక సార్లు వెళ్లి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడమే కాక ఈ ప్రాంతాలను విముక్తం చెయ్యడం కోసం ఆశిస్తున్నా ప్రముఖులను కలిశారు. 1954 ఏప్రిల్‌లో నేషనల్ మూమెంట్ లిబరేషన్ ఆర్గనైజేషన్, ఆజాద్ గోమాంతక్ దళ్ ల తో కలిసి ,దాద్రా నగర్ హావేలీ ల ను భారత రాజ్యం లో విలీనం చెయ్యడానికి ఆర్ఎస్ఎస్ ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేసింది. 1954 ఆగస్ట్ 2న ఆజాది గోమంతక్ దల్ అనే దళం ఆధ్వర్యంలో అనేక మంది యువకులు దాద్రా, నగర్ హవేలీని చేజిక్కించుకోవడంలో ముఖ్య పాత్ర వహించారు. దాద్రా, నగర్ హవేలీలోనికి వంద మంది సంఘ స్వయంసేవకులు జొరబడ్డారు. పుణె సంఘచలాక్ స్వర్గీయ వినాయకరావు ఆప్టే నేతృత్వంలో ఈ దాడి జరిగింది.ఆ బృందంలో అనేక మంది ప్రముఖులైన సంఘ కార్యకర్తలు ఉన్నారు.

గెరిల్లా వ్యూహాన్ని రూపొందించి, సెల్వాసాలోని ప్రధాన పోలీసు కేంద్ర కార్యాలయంపై దాడి చేసి, అక్కడి 175 మంది సైనికులు భేషరతుగా లొంగిపోయేటట్లు చేశారు ,జాతీయ త్రివర్ణ పతాకం ఎగరవేశారు. అదే రోజున ఆ ప్రాంతాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించారు. ఈ ప్రయత్నం లో అనేకమంది స్వయంసేవకులు ప్రాణాలను అర్పించారు .ఈ విషయాన్ని Dadra and nagar Haveli :past and present అనే పుస్తకం ను ps Leela రాయడం జరిగింది ,100 మందికి పైగా ఆరోజు పోరాటం లో పాల్గొన్న స్వయంసేవక్ ల ను అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్ర పోరాట వీరుల గా గుర్తించింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన సూరి సీతారాం అనే స్వయంసేవక్ తన దళం తో కలిసి ఈ పోరాటం లో పాల్గొని అమరుడు అయ్యాడు, గోవా స్వాతంత్ర వీరుల మ్యూజియంలో మరియు ఎర్రకోట లో సూరి సీతారాం యొక్క చిత్రపటాన్ని మనం చూడవచ్చు.

మరువలేని త్యాగాలు

ఆజాద్ గోమంతక్ దళ్‌లో సభ్యులు మోహన్ రానడే అతని స్నేహితుడు తేలు మాస్కురానాస్ గోవాలో ఆ తరువాత వివిధ పోర్చుగీస్ జైళ్లలో 1969 వరకు శిక్ష అనుభవించారు .ప్రముఖ సంగీత దర్శకుడు స్వయంసేవక్ అయిన సుధీర్ ఫడ్కే ప్రయత్నాల మూలంగా చివరికి వారు విడుదల అయ్యారు.

స్వాతంత్ర్య యోధుడు మోహన్ రానడే తన `సర్ఫరోషీ కీ తమన్నా'అనే పుస్తకంలో పోర్చుగీసు కాలనీలను విముక్తం చెయ్యడానికి జరిగిన అనేక ప్రయత్నాలను నెహ్రూ ఏ విధంగా నీరుగార్చారో ఆ పుస్తకంలో వివరించారు. ఈ విముక్తి పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు పాల్గొన్నారని మోహన్ రానడే చెప్పడం జరిగింది. భారతదేశ సార్వభౌమత్వం పరిరక్షణలో స్వయంసేవకుల త్యాగాలు మరువలేనివి


త్రిలోక్

83175 31398

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.

Advertisement

Next Story